ENGLISH | TELUGU  
Home  » TV News

అరుంధతి కూతురు వెన్నెలని రాహుల్ కిచ్చి పెళ్ళిచేయాలన్న రుద్రాణి!

on May 21, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-101లో.. రాజ్, కావ్య గదిలో ఉండగా.. రాజ్ గురకపెడుతున్నాడనే విషయం కావ్య చెప్తే అతను నమ్మడు. దాంతో కావ్య రాజ్ ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో గురక పెట్టడం చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత కాసేపు కావ్య నవ్వుకుంటుంది. రాజ్ సరేలేనని కవర్ చేస్తాడు.

మరుసటి రోజు ఉదయం దుగ్గిరాల ఇంటికి డాక్టర్ వస్తాడు. అపర్ణ, రుద్రాణి, రాజ్ వాళ్ళ నాన్న, ఇందిరాదేవి, ధాన్యలక్ష్మి అందరూ డాక్టర్ ను చూసి "డాక్టర్.. డాక్టర్.. మీరా" అని అడుగుతారు. దానికి ఆ డాక్టర్.. "నేనొక డాక్టర్ ని ఏలియన్ ని కాదు.. అందరూ అలా వింతగా చూస్తున్నారేంటి" అని అడుగగా.. మీరెందుకు వచ్చారని అడుగుతారు. రాజ్ పిలిచాడు వచ్చానని డాక్టర్ చెప్తాడు. అది విని వెంటనే కావ్య  పరుగున రాజ్ దగ్గరకి వెళ్తుంది. అలా వెళ్ళి.. మీ కోసం డాక్టర్ వచ్చాడని చెప్తుంది. రాజ్ కంగారుగా కిందకి వచ్చి.. అసలు నిజం ఎవరికీ చెప్పకుండా ఆపేస్తాడు. అందరూ డాక్టర్ నీకోసం ఎందుకు వచ్చాడని రాజ్ ని అడుగుతారు. బరువు పెరిగాను.. డైట్ ప్లాన్ గురించి డాక్టర్ ని పిలిపించానని చెప్పి.. ఈ డాక్టర్ ని తన గదికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత కొన్ని టిప్స్ తీసుకొని పంపించేస్తాడు.  మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో ఉండగా అపర్ణకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు వేయికోట్ల ఆస్తి  ఉన్న తన ఫ్రెండ్ అరుంధతి.. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని అపర్ణ అందరితో చెప్తుంది. దాంతో అందరూ హ్యాపీగా ఉంటారు. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారని సీతారామయ్య అడుగగా.. నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. లేదు నా కొడుకు రాహుల్ చూసుకుంటాడని రుద్రాణి అంటుంది. అంతేకాదు రుద్రాణి కొడుకు రాహుల్ కి, అరుంధతి కూతురు వెన్నెలకి పెళ్ళిచేయాలని అపర్ణకి చెప్తుంది రుద్రాణి. ఖాళీగా ఉండేవాడికి ఆ అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్ళి చేస్తారని, నేను కళ్యాణ్ కి వెన్నెలతో పెళ్ళిచేయాలని అనుకుంటున్నట్లుగా అపర్ణ అంటుంది. దాంతో రాజ్ తర్వాత పెద్దోడు రాహులే కదా తనకే ఇచ్చి పెళ్ళిచేయాలని అంటుంది. దాంతో అపర్ణ, ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు.

మరోవైపు స్వప్నకి పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తుంది కనకం.. కానీ స్వప్న ఇష్టం లేదని రెడీ అవ్వకుండా అలాగే కూర్చుంటుంది. అప్పుడే గదిలోకి వచ్చిన కనకం తన ఫోన్ ని బెడ్ పై పెట్టి బీరువాలో ఉన్న చీరకోసం చూస్తుంటుంది. అంతలో కనకం ఫోన్ నుండి ఏదో ఒక నెంబర్ తన ఫోన్ లో టైప్ చేసుకుంటుంది స్వప్న. ఆ తర్వాత కనకం తనని రెడీ అవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.