ENGLISH | TELUGU  
Home  » TV News

మురారిని ముట్టుకోకుండా బొట్టుపెట్టిన కృష్ణ.. అసూయతో ముకుంద!

on May 21, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -162లో.. ఈ మధ్య డల్ గా ఉంటున్నావని మురారితో కృష్ణ అంటుంది. మీకొక విశ్వ సౌందర్యం చూపిస్తానని మురారికి చెప్పి అతని కళ్ళు మూసి తీసుకొని వెళ్తుంది కృష్ణ. మురారి కళ్ళు తెరిచి చూసేసరికి గొడపై కృష్ణ ఫన్నీ ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసి మురారి నవ్వుతాడు. మీకు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు మీరు వచ్చి ఈ ఫొటోస్ చూడండని కృష్ణ అంటుంది. ఇద్దరు ఆ ఫోటోస్ చూస్తూ సరదాగా కాసేపు నవ్వుకుంటారు.

మరొకవైపు ముకుంద గురించి ఆలోచిస్తుంటుంది రేవతి. కృష్ణ, మురారిల కాపురానికి ముకుంద అడ్డు వస్తుందేమోనని భయపడుతుంది రేవతి. ఎలాగైనా ముకుందని నేను గమనిస్తున్నట్లు తెలియాలని రేవతి అనుకుంటుంది. అప్పుడు ముకుంద వెళ్తుంటే మాట్లాడాలని  రేవతి పిలుస్తుంది. మీ నాన్న వచ్చి నీ గురించి మాట్లాడి బాధపడడం ఎందుకు ముకుంద.. ఆదర్శ్ ఎలాగైనా వస్తాడు. ఆ నమ్మకం మాకు ఉంది కానీ ఆదర్శ్ వచ్చేవరకు.. నువ్వు మీ నాన్న దగ్గర ఉంటే మీ నాన్న హ్యాపీగా ఉంటాడు..  రేపు వెళ్తావా? మేము దిగబెట్టి వస్తామని ముకుందతో రేవతి అంటుంది. వద్దు అత్తయ్య.. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపినప్పుడు వారింట్లోనే ఉండాలి. ఆదర్శ్ వచ్చినా రాకున్నా నేను ఇక్కడే ఉంటానని ముకుంద అంటుంది. మరొకవైపు ప్రసాద్, మధులు డ్రింక్ చేయడానికి మందు గురించి గొడవపడుతుంటారు. బయట మధు, ప్రసాద్ లు డ్రింక్ చేస్తూ ఉంటే.. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ల దగ్గరికి వస్తారు. ఏంటీ ఈ గొడవ మా నిద్ర డిస్టర్బ్ చేశారంటూ రేవతి అంటుంది. ఇక్కడ అందరూ సరదాగా ఎంజాయ్ చెయ్యాలని మధు అంటాడు. సరదాగా ఒక గేమ్ ఆడుదామంటూ మధుని ఫూల్ చేస్తుంది కృష్ణ. అందరూ మధుని చూసి నవ్వుతారు. 

ఆ తర్వాత కృష్ణతో మధు మాట్లాడతాడు. మురారిని ముట్టుకోకుండా తనకి బొట్టు పెట్టమని కృష్ణతో మధు చెప్తాడు. మురారికి కృష్ణ తన నుదిటికి ఉన్న బొట్టుని మురారి నుదిటికి అంటిస్తే..  మురారికి ఆ బొట్టు అంటుకుంటుంది. ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటారు. అలా హ్యపీగా సాగుతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ మురారి దగ్గరికి వచ్చి.. ఏంటీ ఇలా ఉన్నారని మురారిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.