రాగసుధ అలర్ట్.. బెడిసికొట్టిన ఆర్య - జెండేల ప్లాన్!
on Mar 5, 2022

బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. జీ తెలుగులో గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ కీలక పాత్రలో నటించిన నిర్మించారు. సాయి వెంకట్ డైరెక్ట్ చేసిన ఈ సీరియల్ ని ఆత్మ, పగా, ప్రతీకారం నేపథ్యంలో రూపొందించారు. రాగసుధ ఆచూకీ కోసం ఆర్య వర్ధన్ - జెండే మాస్టర్ ప్లాన్ వేస్తారు. వశిష్టని తామో తప్పించుకునేలా చేసి తను బయటికి రావడంతో అతనిపై నిఘా పెడతారు. ఆర్య వర్థన్ - జెండే ల ప్లాన్ ప్రకారం తెలియకుండానే వశిష్ట ట్రాప్ లో చిక్కుకుంటాడు.
రాగసుధ వుంటున్న సుబ్బు ఇంటికి చేరతాడు. అదే సమయంలో టిఫిన్ సెంటర్ వద్ద పని పూర్తవడంతో రాగసుధ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటి ముందు వశీష్ట కనిపించడంతో షాక్ కు గురైన రాగసుధ వెంటే అతన్ని ఇంటిలోకి తీసుకెళ్లి ఎలా వచ్చావ్.. ఈ దెబ్బలేంటీ? అని ప్రశ్నిస్తుంది. తానని ఆర్య, జెండే బంధించి చిత్ర హింసలకు గురిచేశారని చెబుతాడు. సుబ్బు ఇంట్లో రాగసుధ, వశిష్ట వున్నారని గమనించి అక్కడికి చేరుకున్న ఆర్య, జెండే వారిపై ఎటాక్ చేయడానికి సిద్ధమవుతారు. విషయం పసిగట్టిన రాగసుధ వారికి షాకిస్తుంది.
Also Read: రాగ సుధ ఎక్కడుందో ఆర్య వర్థన్ కి తెలిసిపోయిందా?
ముందు డోర్ వద్ద గన్ తో జెండే - ఆర్యవర్ధన్ వుండటాన్ని పసిగట్టిన రాగసుధ ముందు వశిష్టని వెనక ద్వరం ద్వారా తప్పించి వెళ్లిపోమంటుంది. ఆ తరువాత తను కూడా తనతో పాటే పారిపోతుంది. ఊహించని ట్విస్ట్ కు జెండే హర్ట్ అవుతాడు. మళ్లీ తప్పించుకుందని ఊగిపోతాడు.. కట్ చేస్తే బస్తీపై కన్నేసిన లోకల్ ఎమ్మెల్యే తన అనుచరులతో పెద్దమ్మ బస్తీ వాసులపై దౌర్జన్యం చేయిస్తాడు. అడ్డువచ్చిన ప్రతీ ఒక్కరినీ చితక బాదిస్తాడు. ఈ విషయాన్ని బస్తీ వాసులంతా సుబ్బుకు చెప్పి ఏదో ఒకటి చేయమంటారు. కట్ చేస్తే విషయం ఆర్యవర్థన్ వద్దకు చేరుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. ఆర్య ఏం చేశాడు? ఎమ్మెల్యేకి ఎలా బుద్ధి చెప్పాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



