ENGLISH | TELUGU  
Home  » TV News

మొదటిసారి ఆపరేషన్ చేస్తోన్న కృష్ణ!

on Apr 15, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -131లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి కిందకి వస్తుంటే కృష్ణ కాలుజారి పడిపోతుండగా మురారి పట్టుకుంటాడు. అదంతా చూస్తున్న ముకుంద తనే కృష్ణని నెట్టివేసినట్లు ఉహించుకొని.. నేనేంటి ఇంత గోరంగా ఆలోచిస్తున్నాను. అయినా కృష్ణ గురించి నాకేంటి.. నాకు కావాల్సింది మురారి అని ముకుంద అనుకుంటుంది. కిందకి వచ్చిన మురారితో.. మనం బయటకు వెళ్ళాలని ముకుంద అంటుంది. పక్కనే ఉన్న కృష్ణ.. బయటకు ఎందుకుని అనగానే.. పెద్దత్తయ్య వెళ్ళమని చెప్పారని ముకుంద అంటుంది. అవునా పెద్ద అత్తయ్య చెప్తే వెళ్ళండని కృష్ణ అంటుంది. ముకుంద, మురారి ఇద్దరు వెళ్ళిపోగానే.. నేనేంటి పర్మినెంట్ పెళ్ళాన్ని అయినట్లు బిహేవ్ చేస్తున్నానని కృష్ణ అనుకుంటుంది. 

ఆ తర్వాత నందు దగ్గరికి కృష్ణ వెళ్తుంది. పదా కృష్ణ హాస్పిటల్ కి వెళదాం.. అక్కడ సిద్దు ఉంటాడని నందు అంటుంది. వద్దని కృష్ణ అంటున్నా వినకుండా నందు కిందకి తీసుకొస్తుంది. అక్కడ సిద్ధుని కలుద్దామని నందు మళ్ళీ అంటుంది. ఇక అక్కడే ఉన్న భవాని, ఈశ్వర్, ప్రసాద్ లు ఒక్కసారిగా షాక్ అవుతారు. సిద్దు లేదు.. ఏం లేదు లోపలికి వెళ్ళమని ఈశ్వర్ అనగానే.. నందు అలిగి లోపలికి వెళ్తుంది. నందు లోపలికి వెళ్లగానే.. ఇదంతా నీ వల్లే కృష్ణా.. నందుని ఏం చేద్దామని అనుకుంటున్నావని భవాని, ఈశ్వర్ లు అడుగుతారు. మంచి మనిషిని చేద్దామనుకుంటున్నానని కృష్ణ అంటుంది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య.. ఈ రోజు మొదటిసారి ఆపరేషన్ చేస్తున్నా అని భవాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని కృష్ణ కాలేజీకి వెళ్తుంది. ఇక కృష్ణ ఆటోలో వెళ్తూ మురారికి ఎలాగైనా నిజం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. మరో వైపు ముకుంద, మురారి కళ్యాణ మండపం బుక్ చెయ్యడానికి వెళ్తారు. మురారి పరధ్యానంలో ఉంటూ కృష్ణకి ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తాడు. మరోవైపు కృష్ణ కాలేజీకి వెళ్తుంది. అక్కడ గౌతమ్ ని కలుస్తుంది కృష్ణ. ఏమైంది లేట్ అయిందని గౌతమ్ అడగగానే జరిగిందిగంతా చెప్తుంది కృష్ణ. ఇంకా రెండు రోజులే కదా.. ఆ తర్వాత నందుని పసి పాపలాగా చూసుకుంటా అని గౌతమ్ అంటాడు.

మరోవైపు భవాని నిర్ణయం మార్చుకుంటున్నానని తన నిర్ణయాన్ని ఈశ్వర్, ప్రసాద్ లకి చెప్తుంది. నందు గురించి ముకుందకి చెప్పాలని భవాని అనగానే.. ముకుంద వస్తుంది. దాంతో నందు, గౌతమ్ ల ప్రేమ విషయం ముకుందకి చెప్తారు. ఈ నిజం తెలుసుకున్న ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.