ENGLISH | TELUGU  
Home  » TV News

రాజ్ కి మర్దన చేస్తోన్న కావ్య!

on Apr 15, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ‌ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-70లో.. కనకం ఇంటికి సేట్ జీ వస్తాడు. స్వప్న పెళ్ళి కోసం సేట్ జీ దగ్గర కనకం వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు‌ తీసుకుంటుంది. ఆ డబ్బుల తాలూకా వడ్డీ తీసుకోడానికి సేట్ జీ రాగా.. సేట్ జీని ఎవరికంటా పడకుండా కనకం పక్కకి తీసుకుని వెళ్ళి సేట్ జీ తో వడ్డీ కట్టేస్తానని మాట్లాడి పంపించేస్తుంది. అలా అతడిని పంపించేముందు కృష్ణమూర్తి చూస్తాడు. ఏంటి కనకం అల్లుడు వచ్చాడని మళ్ళీ అప్పు చేస్తున్నావా అని అడుగగా.. అదేం లేదండీ.. అల్లుడు గారిని చూడటానికి వచ్చాడని చెప్తుంది కనకం.

మరోవైపు కనకం వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పడుతున్న రాజ్.. హాల్లో నుండి బయటకు వస్తుండగా.. కృష్ణమూర్తి అతడిని చూసి.. ఎక్కడికి బాబు ఏమైనా కావాలా అని అడుగుతాడు. ఈ ఇంట్లో వేడిగా ఉందని రాజ్ చెప్పగా... అయితే స్నానం చేయండి అల్లుడు గారు వేడి తగ్గుతుందని కృష్ణమూర్తి చెప్తాడు. ఆ తర్వాత కావ్యని పిలిచి రాజ్ స్నానానికి ఏర్పాట్లు చేయమంటాడు. టవల్, సబ్బు రాజ్ కి ఇచ్చి బాత్రూం బయట ఉంటుంది కావ్య. లోపలికి వెళ్ళిన రాజ్ చేతిలోని సబ్బు కిందకి పడిపోతుంది. దానిని చూసుకోకుండా సబ్బు మీద కాలు వేయగా కాలు జారి పడిపోతాడు. వెంటనే రాజ్ గట్టిగా అరవడంతో ఇంట్లో వాళ్ళంతా వస్తారు.

ఏమైందని కనకం వాళ్ళ అక్క మీనాక్షి, కనకం, అప్పు, కావ్య అందరూ వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి బాత్రూం నుండి   కావ్య వాళ్ళ గదిలోని బెడ్ మీదకి తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన కనకం, మీనాక్షిలు బాధతో ఏడుస్తుంటారు. దాంతో రాజ్ వాళ్ళని బయటకు పంపేయమని  కావ్యతో అనగా.. తను వాళ్ళని బయటకు పంపించేస్తాడు. ఆ తర్వాత కావ్య రాజ్ కి మర్దన చేస్తుంది. మరోవైపు రాహుల్ ని వెతుక్కుంటూ స్వప్న దుగ్గిరాల కుటుంబం గేట్ దగ్గరికి రాగా.. రాహుల్ కంగారుగా వచ్చి స్వప్నకి నచ్చజెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.