చిత్రగారు పేపర్ ని తిరగేసి కూడా చదవగలరు.. పాత్రికేయులు అడగాల్సిన ప్రశ్న అది కాదు
on Jul 31, 2025

పాడుతా తీయగా షో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. ఈ వారం షోలో జయరాం అనే కుర్రాడు "ఏదో ఒక రాగం" అనే సాంగ్ పాడాడు. ఐతే పాట పూర్తయ్యాక "చిత్ర గారిలా చక్కగా పాడావు" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు కీరవాణి. అలాగే చిత్ర గారి సూపర్ టాలెంట్ గురించి చెప్పుకొచ్చారు. "చిత్ర గారు పుట్టకతో ఆవిడ మలయాళీ. మెల్లమెల్లగా తెలుగు పాటలు పాడుతూ తెలుగు నేర్చుకున్నారు. చాలామంది తెలుగు వాళ్లకు కూడా రాని తెలుగు ఆమెకు వచ్చు. ఆ పదాల అర్థాలతో పాటు అన్ని ఆమెకు తెలుసు. పైగా ఆవిడ తెలుగు పేపర్ ఏదన్నా ఉంటే దాన్ని తిరగేసి మరీ చదువుతారు. ఆవిడ పేపర్ ని తిరగేసి పదాలను గుర్తు పట్టి చదివేస్తూ ఉంటారు.
ఆమెను చూసి నేను చాలా సార్లు ఆశ్చర్యపోయాను. కాగితం తిరగేసి ఉన్నా కూడా చదవగలుగుతున్నారు అని అనేవాడిని. ఒక భాష మీద సాధికారత సంపాదించాలంటే దానికి శ్రద్ద, ఆసక్తి ఉంటే చాలు. గత 30 ఏళ్ళుగా పాత్రికేయులు నన్ను తినేస్తూ ఉంటారు... నన్నే కాదు అందరినీ ఎందుకు పరభాషా గాయకులతో పాడిస్తున్నారు అని..కానీ అది కాదు అడగాల్సిన ప్రశ్న..చక్కగా పాడుతున్నారా లేదా అని.. పరభాషా గాయకులూ పాడడం ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు కరెక్ట్ గా పాడడమే మనకు కావాల్సింది. అలా చూసుకుంటే బాలుగారు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ వంటి అనేక భాషల్లో పాటలు పాడారు. పరభాషా గాయకులు పాడకూడదు అని వాళ్ళందరూ కూడా అనుకుని ఉంటే చక్కటి గాయకులను వాళ్లంతా మిస్ అయ్యుండేవాళ్లు కదా" అంటూ చెప్పారు కీరవాణి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



