జీవితంలో ఏది జరగకూడదనుకున్నానో అవన్నీ జరిగాయి
on Jul 31, 2025

చాన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ రతికా రోజ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఒక ఇంటర్వ్యూకి సెలెబ్రిటీగా పల్లవి ప్రశాంత్ వచ్చాడు. ఇక హోస్ట్ వర్షా కూడా ఇంటరెస్టింగ్ ప్రశ్నలే వేసింది. "ఇంత మంచి మనిషివి చాలా కష్టపడి ఇంత స్టేజికి వస్తే నిన్ను చాలా మంది తిట్టారు" అని చెప్పింది. ఇక పల్లవి ప్రశాంత్ ఏడుస్తూ " అన్నా ఒక మనిషి గురించి తెలుసుకుని వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా చూడాలి.." అన్నాడు. "అమరదీప్ తో నీ బాండింగ్ ఎలా ఉంది ఇప్పుడు" అని అడిగింది. "అన్నా ఆ పంచాయతీలన్నీ విడిచిపెట్టు.
నేను మీరు చేశారు అనుకున్నా..మీరు నేను చేసాను అనుకున్నారు. చెప్పాను కాదన్నా..లవ్ యు అన్నా" అన్నాడు. "విజయం సాధించాక ఎవరైనా ఇంటికి వెళ్తారు కానీ నువ్వు జైలుకు వెళ్ళావు ప్రశాంత్" అంది. "నుదిటిన రాసుంది..ఇంత బతుకు బతికి బాపు అక్కడ కోర్ట్ మెట్ల కాడ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ బాధపడుతున్నాడు " అన్నాడు. "జైల్లోకి వెళ్లిన ఇన్సిడెంట్ లైఫ్ లాంగ్ గుర్తు ఉంటుంది. జైల్లోకి వెళ్లి నాలుగు రోజులు ఉన్నప్పుడు అన్నా బిగ్ బాస్ లో ఎవరు గెలిచారు అన్నారు..ఏది చూడకూడదు అనుకున్నానో అవన్నీ చూసాను. జైలుకు వెళ్లాను, చావు బతుకుల వరకు వెళ్లాను. ఒక రోజు ఒకళ్ళు సాయం కావాలని అని అడిగితే అర్ధరాత్రి అక్కడికి వెళ్లి వస్తున్నాం. కార్ లారీని అన్నా ఢీ కొట్టాలి లేదంటే పక్కనే ఉన్న జంతువునన్నా ఢీ కొట్టాలి. నేను కార్ సైడ్ కి తీసుకున్న. మూడు పల్టీలు కొట్టింది. తమ్ముడికి మెడ దగ్గర దెబ్బ తగిలింది. దాంతో అన్నా అని అరిచాడు. అన్నా అని అరిచేసరికి భరించడం నా వల్ల కాలేదు..ఆరోజు వాడికేమన్నా ఐనా నాకేమన్నా ఐనా అంతే" అంటూ బాధగా తన జీవితంలో జరిగిన సంఘటనను చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్ .
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



