ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : పారిజాతం  ప్లాన్ ఫెయిల్.. కడియం సూటిప్రశ్న!

on May 10, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -40 లో.. దీప నెక్లెస్ దొంగతనం చేసిందని పారిజాతం అంటుంది. తనకి జ్యోత్స్న కూడా సపోర్ట్ చేస్తుంటుంది. నువ్వు నీ కూతురు శౌర్యతో అయినా నెక్లెస్ తీసుకొని రమ్మని చెప్పి ఉంటావని పారిజాతం అనగానే.. నేను నా కూతురితో ఈ పని చేయించను అని దీప బాధపడుతుంది. అప్పుడే శౌర్య వస్తుంది..

నెక్లెస్ చూసావా అని శౌర్యని పారిజాతం అడుగగా.. అంటే ఏంటని శౌర్య అంటుంది. మెడలో వేసుకుంటారు.. మెరుస్తుంటుందని పారిజాతం అనగానే.. ఒహ్హ్ అదా.. చూసానని శౌర్య అనగానే అందరు షాక్ అవుతారు.. చూసావా అని పారిజాతం అనగానే.. అవును చూసాను మా అమ్మ బ్యాగ్ లో అని శౌర్య అంటుంది. దాంతో చూసారా ఇందాకటి నుండి నేను తిడుతుంటే అడ్డుపడ్డారు కదా.. ఇప్పుడేం అంటారని పారిజాతం అంటుంది. దీపని తిడుతుంటే.. ఎందుకు మా అమ్మ ని తిడుతున్నారని శౌర్య అడుగుతుంది. నెక్లెస్ తీసింది కదా అని పారిజాతం అనగానే.. నెక్లెస్ మా అమ్మ బ్యాగ్ లో పెట్టిందని నేను చెప్పనా.. ఆ అంకుల్ పెట్టాడు అంటు బంటుని శౌర్య చూపిస్తుంది. అందరు బంటు వంక కోపంగా చూస్తారు. నువ్వు వెళ్లి నెక్లెస్ తీసుకొని రా అంటూ శౌర్యని కార్తీక్ పంపిస్తాడు. ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావంటు బంటుని కార్తిక్ అడుగుతాడు. ఎక్కడ తన పేరు చెప్తాడోనని పారిజాతం బయపడుతుంది. నేనే చేసానని బంటు అనగానే.. నువ్వు చాలా తప్పులు చేసావ్.. ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో ఉండడం వద్దని దశరత్ అంటాడు. బంటు వెళ్ళిపోతాడు. మాట అనే ముందు ఆలోచించాలని  జ్యోత్స్నతో కార్తిక్ చెప్తాడు. కాసేపటికి పారిజాతాన్ని శివనారాయాణ తిడతాడు.

ఆ తర్వాత కాంచనకి పారిజాతం ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అప్పుడే కాంచన భర్త వచ్చి.. ఏంటి అంట అని అడుగుతాడు. కార్తీక్ జ్యోత్స్నకి కాకుండా దీపకి సపోర్ట్ చేసాడట‌‌.. దీపతో క్లోజ్ గా ఉంటున్నాడాట అని అంటాడు. చెల్లితో కార్తీక్ జ్యోత్స్న ల పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడాలి బావ అని కాంచన భర్త అంటాడు.. మరొకవైపు దీప కడియం దగ్గరికి వెళ్లి రేపటి నుండి నా వంటలు చూస్తావని చెప్తుంది. నువ్వు అంత పెద్దింట్లో ఉంటు నా దగ్గర పని చెయ్యడమేంటని కడియం అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.