Karthika Deepam2: దీప కన్నతండ్రి కుబేర్ కాదని చెప్పేసిన అనసూయ.. షాక్ లో పారిజాతం!
on Aug 1, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -424 లో.....దీప బాధపడుతుంటే ఇంకా ఆ మాటల గురించే ఆలోచిస్తున్నావు.. ఎలాగు రేపు మీ నాన్న దగ్గరికి వెళ్తావ్ కదా అని కార్తీక్ అనగానే ఏంటి ఏమంటున్నావ్ రేపు వెళ్లడమేంటని కాంచన అంటుంది. కార్తీక్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత కావేరి దగ్గరికి శ్రీధర్ వచ్చి రేపు ఒక ప్లేస్ కి వెళ్ళాలి.. రేపు ప్రోగ్రాం ఏం పెట్టుకోకని అంటాడు.
మరుసటి రోజు కుబేర్ ఆర్ధికంకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. దీప పిండం పెట్టబోతుంటే అనసూయ తీసుకొని నా తమ్ముడికి నేను పెడతాను.. మీరు వెళ్లి అన్నదానం దగ్గర భోజనం ఏర్పాట్లు చూడండి అని అనసూయ అంటుంది. ఆ తర్వాత అన్నదానం దగ్గరికి దశరథ్ కుటుంబంతో వస్తాడు. అప్పుడే శ్రీధర్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఎప్పటిలాగే శ్రీధర్ ఏదో ఒకటి గొడవ పెట్టుకోవడానికి మాట్లాడతాడు. ఇక్కడ మాకు మర్యాదలు చెయ్యట్లేదు అన్నట్లుగా దీప, కార్తీక్ లతో పారిజాతం అంటుంది.
ఆ తర్వాత దశరథ్ చైర్ పై కూర్చోబోతుంటే కింద పడిపోబోతాడు.. మెల్లిగా నాన్న అని దీప అనగానే.. దొరికింది ఛాన్స్ అని ఇప్పుడు ఏమన్నావ్ ఇలా ఎన్నిసార్లు నాన్న అంటావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఈ రోజు వాళ్ళ నాన్న ఆర్ధికం కదా.. నాన్న అని ఆ ధ్యాసలో ఉండి అంది అని కార్తీక్ కవర్ చేస్తాడు. అయిన పారిజాతం వినిపించుకోకుండా గొడవపెడుతుంది. నీ వల్ల చనిపోయిన మీ నాన్నకి కూడా ప్రశాంతంగా ఉండదని పారిజాతం అంటుంటే.. పదే పదే చనిపోయాడు అనకండి అని దీప అంటుంది. చనిపోయిన వాడిని పట్టుకొని అలా కాకుండా ఎలా అంటారని పారిజాతం అంటుంది. మా నాన్న చనిపోలేదని దీప అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు.ఫోటో ఎదురుగా పెట్టుకొని చనిపోలేదంటారు ఏంటని శ్రీధర్ అడుగుతాడు. అది నా తమ్ముడు కుబేర్ ఫోటో అని అనగానే అంటే దీప నాన్నే కదా అని పారిజాతం అంటుంది. కాదని అనసూయ అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



