Brahmamudi : దుగ్గిరాల కుటుంబమంతా షాక్.. స్వరాజ్ ఏం చేసాడంటే!
on Aug 1, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -788 లో.....రేవతి బాబుని అపర్ణ బాగా చూసుకుంటుంది. అన్నం తినిపిస్తుంది.. అదంతా కావ్య వీడియో కాల్ చేసి రేవతికి చూపిస్తుంది. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. బాగా టైడ్ అయ్యావ్ పడుకుందువురా అని బాబుతో అపర్ణ అంటుంది. నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళు అని బాబూ అనగానే బాబుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది అపర్ణ.
ఆ తర్వాత ఇందిరాదేవి బాబు ఎక్కడ చూస్తాడోనని ముసుగు వేసుకొని వెళ్తుంటే ఏమైందని రుద్రాణి అడుగుతుంది. అప్పుడే ఇందిరాదేవికి బాబు డాష్ ఇస్తాడు. తాతమ్మ అనగానే అందరు షాక్ అవుతారు. ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని రాజ్, కావ్య టెన్షన్ పడుతుంటారు. మా అమ్మ నీకు ముందే తెలుసా ఎందుకు అలా పిలిచావని రుద్రాణి అడుగుతుంది. నువ్వు నాకూ నచ్చలేదని రుద్రాణితో అంటాడు బాబు. నేను అంటే నీకు ఇష్టం కదా నాకు చెప్పు మా అత్తయ్య ముందే తెలుసా అని అపర్ణ అడుగుతుంది. మా అమ్మ ఇలా బొండంలాగా ముసలివాళ్ళు ఎవరు కనిపించినా కూడా తాతమ్మ అని పిలవమందని బాబు అనగానే రాజ్, కావ్య రిలాక్స్ అవుతారు.
ఆ తర్వాత రాజ్, కావ్య బాబు బయట ఉంటారు. నేను ఎక్కడ తెలుసు అంటానోనీ భయపడ్డారా.. నాకు మీరు గుళ్లో ఏమని చెప్పారు.. ఎవరు తెలిసినా తెలియనట్లు ఉండమన్నారు కదా అని బాబు అంటాడు. మరొకవైపు రాజ్ కి ఫోన్ చేస్తుంది యామిని. నేను రేపు కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నానని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య దగ్గర పడుకుంటానని బాబు అనుకుంటాడు. లేదు.. నువ్వు నీ ఫ్రెండ్ అపర్ణ దగ్గర పడుకోమని కావ్య చెప్తుంది. సరేనని బాబూ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



