Karthika Deepam2 : కాశీని కొట్టేసిన కార్తీక్.. కాంచన కోసం దిగొచ్చిన శివన్నారాయణ!
on Jul 3, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -399 లో....జ్యోత్స్న చేసిన తప్పుని నిలదియ్యడానికి శివన్నారాయణ ఇంటికి కాశీ వెళ్తాడు. అక్కడ జ్యోత్స్నపై కాశీ కోప్పడతాడు. నేను చేసిన దానికి దీపకి సారీ చెప్పాను అయినా తృప్తి కాలేదు అనుకుంటా తమ్ముడిని రప్పించి మరి తిట్టిస్తుందని దీపపై అందరికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది జ్యోత్స్న. నాకేం తెలియదు నేను కాశీని ఏం రమ్మన్నలేదని దీప అంటుంది.
అసలు ఆ జ్యోత్స్న ఇలా తయారు కావడానికి ఆ పెద్దాయన కారణం అని శివన్నారాయణ గురించి కాశీ తప్పుగా మాట్లాడుతుంటే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కాశీపై కోప్పడుతాడు కార్తీక్. దీప కూడా నువ్వు వెళ్ళు కాశీ అంటూ ఏడుస్తుంది. నీ కన్నీళ్లు కూడా ఈ ఇంట్లో పడడానికి అర్హత లేదు అక్క.. ఈ ఇంట్లో అందరు రాక్షసులు అని కాశీ అనగానే కాశీ చెంప పగులగొడుతాడు కార్తీక్. కాశీ ని కార్తీక్ బయటకు పంపిస్తాడు. నా కూతురు కావాలనే కాశీని రెచ్చ గొట్టిందని దశరత్ అనుకుంటాడు. ఆ తర్వాత మీరు కాశీని కొట్టి తప్పు చేసారని కార్తీక్ తో దీప అంటుంది. కానీ తప్పలేదని కార్తీక్ అంటాడు. ఫోన్ చేసి కాశీతో మాట్లాడండి అని దీప అంటుంది.
ఆ తర్వాత కార్తీక్, దీప ఇద్దరు కలిసి స్వప్న, కాశీలని కలిసి మాట్లాడతారు. కోపంలో అలా చేసానని కాశీతో కార్తీక్ అనగానే.. మీకు నన్ను కొట్టే అర్హత ఉందని కాశీ అంటాడు. మరొకవైపు కాంచనని చూడడానికి శివన్నారాయణ, జ్యోత్స్న కాంచన ఇంటికి వెళ్తారు. వాళ్ళతో మాట్లాడుతుంటే అప్పుడే దీప, కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



