Brahmamudi : తమ్ముడు రాజ్ ఇచ్చిన సర్ ప్రైజ్.. రేవతి ఎమోషనల్!
on Jul 3, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -763 లో......రేవతి తన కొడుకుతో బయటకు వస్తుంది. అమ్మా నా పుట్టినరోజు కదా నాకు ఈ షూస్ కోనివ్వమని రేవతి కొడుకు అడుగుతాడు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదని రేవతి తన కొడుకుకి సర్ది చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది. అదంతా రాజ్, కావ్య చూసి బాధపడతారు. అలా ఆశలున్నవారికి కొనే స్థోమత ఉండదని రాజ్ అనగానే.. మనకి కొనే స్థోమత ఉంది కదా వెళ్లి కొందామని కావ్య అంటుంది.
వాళ్ళ ఇల్లు తెలియదు కదా అని రాజ్ అనగానే నాకు తెలుసని కావ్య అంటుంది. మరొకవైపు రేవతి కొడుకు తన నాన్న కేక్ తీసుకొని వస్తాడని ఎదరుచూస్తుంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు.. అప్పుడే రాజ్, కావ్య ఇద్దరు రేవతి ఇంటికి వస్తారు. రాజ్ ని చూసిన రేవతి వెళ్లి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. నేను మీకు తెలుసా అని రాజ్ అనగానే.. నా తమ్ముడు కూడా ఇలాగే ఉంటాడని రేవతి కవర్ చేస్తుంది. ఆ తర్వాత బాబుకి షూస్ సర్ ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేపిస్తారు. రేవతిని రాజ్ అక్క అని తన భర్తని బావ అని పిలుస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ రేవతి ఇంట్లోకి వచ్చి ఫోటో చూస్తూ ఏడుస్తుంది.
ఇప్పుడైన నిజం చెప్పొచ్చు కదా అని తన భర్త అనగానే.. వాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని గుర్తు పట్టలేని సిచువేషన్ లో ఉన్నాడని రేవతి అంటుంది. మరొకవైపు కావ్య, రాజ్ కార్ లో వెళ్తు సరదాగా మాట్లాడకుంటుంటారు. మరొకవైపు రాహుల్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ప్రాపర్టీ కావాలని అడుగుతుంది. దాంతో రాహుల్ లాకర్ కీస్ కోసం వెతుకుతుంటే అప్పుడే స్వప్న వస్తుంది. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంటే..అది రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



