Karthika Deepam2 : కార్తీక్ కి నిజం చెప్పేసిన దశరథ్.. జ్యోత్స్నకి మరో షాక్!
on Jun 7, 2025
స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -377 లో...... కార్తీక్, దీప ఇంటికి వెళ్తుంటారు. వెళ్ళొస్తానమ్మ అని సుమిత్రకి దీప చెప్పగానే నన్ను అలా పిలవద్దని దీపతో కఠినంగా మాట్లాడుతుంది సుమిత్ర. ఎన్నో తప్పులు చేసావ్.. అసలు నిన్ను ఇక్కడ ఉండనివ్వడం మా తప్పు అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ తన వల్లే ఆగిపోయిందని ఇప్పుడు సారీ చెప్పింది కదా.. ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది కదా అని సుమిత్రతో అంటాడు కార్తీక్.
అయిన సుమిత్ర వినకుండా ఇష్టం వచ్చినట్లు దీపతో కఠినంగా మాట్లాడి బాధపెడుతుంది. అదంతా దూరం నుండి దశరథ్ వింటాడు. పాపం దీప ఎంత బాధపడుతుందోనని అనుకుంటాడు. దీప బయటకు వెళ్లి ఏడుస్తుంది. కార్తీక్ ఓదారుస్తాడు. మరుసటి రోజు ఉదయం శివన్నారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్. అప్పుడే బయట దశరథ్ తో పారిజాతం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందని కార్తీక్ దూరం నుండి వింటాడు. నా కొడుకు దాస్ కనిపించడం లేదని పారిజాతం చెప్పగానే. దశరథ్ షాక్ అవుతాడు మీకెలా తెలుసని పారిజాతాన్ని దశరథ్ అడుగుతాడు. నేను, జ్యోత్స్న ఇంటికి వెళ్ళామని పారిజాతం అనగానే.. జ్యోత్స్న ఎందుకు వచ్చిందని దశరథ్ కంగారుపడతాడు. మావయ్య ఎందుకు జ్యోత్స్న వెళ్ళిందంటే కంగారుపడుతున్నాడని కార్తీక్ అనుకుంటాడు.
ఆ తర్వాత నువ్వు ఎలాగైనా దాస్ ని వెతకమని దశరథ్ కి చెప్తుంది పారిజాతం. వెనకాల వైపు తిరిగేసరికి కార్తీక్ ఉంటాడు. నువ్వు అంతా విన్నావు కదా దాస్ ఎక్కడైనా కనిపిస్తాడేమో చూడమని పారిజాతం అంటుంది. ఆ తర్వాత దశరథ్ దగ్గరికి కార్తీక్ వచ్చి.. ఏంటి మావయ్య టెన్షన్ పడుతున్నారని అడుగుతాడు. దాంతో కార్తీక్ ని దశరథ్ పక్కకి తీసుకొని వెళ్లి దాస్ ని కొట్టింది జ్యోత్స్ననే నేనే స్వయంగా చూసానని దశరథ్ చెప్తాడు. మావయ్య కి జ్యోత్స్న గురించి తెలుసు అన్నమాట అని కార్తీక్ అనుకుంటాడు. దాస్ ని ఎందుకు కొట్టిందో తెలిస్తే గాని నేను ఏం చెయ్యలేనని దశరథ్ అంటాడు. అసలు జ్యోత్స్న మీ కూతురు కాదని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్నిటికి సాక్షి దాస్ మావయ్య అని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
