Brahmamudi : ప్రమాదంలో రాజ్, కావ్య.. ఆమెను రౌడీ చంపుతాడా!
on Jun 7, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -741 లో..... రాజ్, కావ్య రౌడీల నుండి తప్పించుకోవాలని అడవిలోకి వెళ్ళిపోతారు. రౌడీలు కూడా కావ్య, రాజ్ ని పట్టుకోవడానికి అడవికి వెళ్తారు. మరొకవైపు అప్పు కాని స్టేబుల్స్ తో అడవి దగ్గరికి వస్తుంది. రాజ్, కావ్య అడవి అంత తిరుగుతారు. నాకు దాహంగా ఉందని కావ్య అనగానే రాజ్ అటువైపు గా వెళ్లి చిన్న ఆకులో వాటర్ తీసుకొని వస్తాడు. దాంతో కావ్య మురిసిపోతుంది. అప్పుడే రౌడీలు వాళ్ళని చూస్తారు.
రాజ్, కావ్య వాళ్ళ నుండి తప్పించుకోవడనకి పరుగెత్తుతారు. ఇద్దరు ఒక దగ్గర దాక్కొని ఉంటారు రౌడీలకి యామిని ఫోన్ చేస్తుంది. వాళ్ళు అడవిలోకి వెళ్లిపోయారు.. మేం వాళ్ళని వెతుకుతున్నాం.. మాకు ఈ అడవి బాగా తెలుసు ఎటు వెళ్తే ఏం వస్తుందో నాకు బాగా తెలుసు కానీ వాళ్లకి తెలియదని యామినితో రౌడీ అంటాడు. కావ్య మాత్రం ఉండొద్దని యామిని రౌడీలకి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత చీకటి అవుతుంది. నాకు భయంగా ఉందని కావ్య అంటుంది. ఇద్దరు ఫోన్ టార్చ్ ఆన్ చేసి ముందుకి వెళ్తారు ఆకలిగా ఉందని కావ్య అంటుంది.
రాజ్ తన కోసం ఏమైనా తీసుకొని రావడానికి వెళ్తాడు. రాజ్ కన్పించకపోయేసరికి కావ్య టెన్షన్ పడుతుంది. రాజ్ రాగానే ఎక్కడికి వెళ్ళావంటూ అడుగుతుంది. నీకు ఆకలి అన్నావ్ కదా.. ఇదిగో అంటూ ఫ్రూట్స్ ఇస్తాడు. ఇవి తినొచ్చా అని కావ్య అనగానే తినొచ్చని రాజ్ అంటాడు. కావ్య రాజ్ ఆ ఫ్రూట్ తిని మత్తుగా అయిపోతారు. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఇద్దరు మత్తులో కిందపడిపోతారు. అప్పుడే రౌడీలు వాళ్ళని చూసి దగ్గరికి వస్తారు. కత్తితో కావ్య దగ్గరికి రౌడీలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



