Karthika Deepam2 : శౌర్యకి ఆపరేషన్.. డబ్బు కట్టింది ఎవరంటే!
on Feb 3, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -271 లో..... శౌర్యకి నిజం గానే బాగోలేదు తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.. అత్తయ్య చెప్పింది నిజమే కాకపోతే నేనే ఇంట్లో వాళ్ళకి అబద్దం చెప్పాను.. దీప దగ్గరికి వెళ్లి ఆఫర్ ఇచ్చాను.. ఇప్పుడు నీ కూతురిని కాపాడేది నేనే.. డబ్బు ఇస్తాను బావని వదిలేసి పొమ్మన్నా కానీ దీప పేపర్స్ మోహన కొట్టింది బావ కూడా తిట్టాడని జ్యోత్స్న అంటుంది. ఇక వచ్చేప్పుడు ఫోన్ చెయ్ అని చెప్పానని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది.
ఇలా చిన్న పిల్లల ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని పారిజాతం అనగానే.. మరొక అబద్దం చెప్తాను. నాకు నా బావ కావాలని జ్యోత్స్న మరి కఠినంగా మాట్లాడతుంది. మరోవైపు కావేరి హాస్పిటల్ కి డబ్బు తీసుకొని వస్తుంది. దీప, కార్తీక్ లు డబ్బు కోసం చెయ్యని ప్రయత్నం ఉండదు. దీప బాధపడుతుంటే.. దీప దగ్గరికి కావేరి వస్తుంది. ఇద్దరు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. శౌర్య నా మనవరాలని కావేరి అంటుంది. అలా అనకూడదా అని కావేరి అంటుంటే.. నాకు కాంచన గారు ఎలాగో మీరు అలాగే అని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావేరి డబ్బు కట్టిన విషయం దీపకి చెప్పదు. నా మనవరాలికి ఏం కాదని దీపకి దైర్యం చెప్తుంది. ఇలా నేను హాస్పిటల్ కి వచ్చినట్లు కార్తీక్ కి చెప్పకని చెప్పి కావేరి వెళ్ళిపోతుంది.
కార్తీక్ ఏం చెయ్యలేక ఎమోషనల్ అవుతుంటాడు.. దీప ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరు శౌర్య దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి తను వుండదు అప్పుడే నర్సు వచ్చి ఎక్కడికి వెళ్లారు. తీసుకొండి అంటూ శౌర్య చైన్ బ్యాంగిల్స్ ఇస్తారు. ఇవి ఎందుకు తీశారు శౌర్య ఎక్కడ అని దీప అడుగుతుంది. ఆపరేషన్ థియేటర్ లో ఉందని నర్సు చెప్తుంది. డబ్బు అని కార్తీక్ అనగానే.. కట్టారు కదా అని నర్సు అంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి గ్రేట్ కార్తీక్ టైమ్ కి డబ్బు కట్టావ్ అని లోపలికి వెళ్తాడు. డబ్బు ఎవరు కట్టారని రిసెప్షన్ లో అడిగితే తెలుస్తుంది కదా అని కార్తీక్, దీప ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



