Illu illalu pillalu: ప్రేమే ఈ గొడవలకు కారణం.. కొడుకుని చూసి రామరాజు ఎమోషనల్!
on Feb 3, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -72 లో.... నా చెల్లిని ఎలాగైనా నా ఇంటికి తీసుకొని వస్తాను. ఇన్ని రోజులుగా అత్తయ్య విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారు. ఆ బాధ నేను పడలేనని విశ్వ అంటాడు. విశ్వ అంత కోపంగా మాట్లాడడంతో రేవతి ఇంకా పెద్దావిడలు అతడిపై కోప్పడతారు. ప్రేమ జీవితం బాగుండేలా చూడు దేవుడా అని పెద్దావిడ బాధపడుతుంది.
ధీరజ్ ని చూసి తన చెల్లి అమూల్య బాధపడుతుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. మా అన్నయ్య తప్పు ఒక్కడిదేనా, మా అన్నయ్యని కొట్టాడు. ఈవిడ కూడా మన కుటుంబంపై పగ తీర్చుకోవడానికే ఇలా చేస్తుందని అమూల్య కోపంగా మాట్లాడుతుంటే.. నర్మద వచ్చి అలా మాట్లాడడం తప్పు.. ప్రేమ చాలా మంచిది తనే కదా ఇప్పుడు మీ అన్నయ్యని కాపాడిందని చెప్తుంది. ధీరజ్ లోపలకి వెళ్లి నొప్పులతో బాధపడుతుంటే.. అప్పుడే ప్రేమ వచ్చి అమూల్య అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా నా వల్లే ఇదంతా అనుకుంటుంది. వెళ్లి నొప్పిగా ఉందా అని ప్రేమ అడుగ్గానే ధీరజ్ వెటకారం గా అంటున్నావా అని గొడవపడతాడు. ఇద్దరు కాసేపు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవపడతారు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరికి వేదవతి వచ్చి.. ఇదంత నా వల్లే అంటూ బాధపడుతుందిమ నువ్వు మంచి చెయ్యాలనుకున్నావ్ అంతే అని ధీరజ్ బాధపడుతాడు.
సాగర్, చందు లు ధీరజ్ గురించి బాధపడుతుంటే.. మీ తమ్ముడు గురించి ఆలోచించడం ముచ్చటేస్తుందని తిరుపతి అంటాడు. అప్పుడే ధీరజ్ వచ్చి.. ఇక్కడే మీతో పడుకుంటానని అంటాడు. తరువాయి భాగంలో అందరు పడుకున్నాక ధీరజ్ దగ్గరికి రామరాజు వచ్చి బాధపడతాడు. తన కంట్లో నీళ్లు ధీరజ్ చెయ్ పై పడతాయి. రామరాజు వెళ్ళిపోయాక ధీరజ్ లేచి నాన్న వచ్చాడని సాగర్ తో చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రామరాజు విశ్వక్ దగ్గరికి వెళ్లి కొడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



