Karthika Deepam2 : కన్నవాళ్ళ దగ్గరగా దీప.. జ్యోత్స్న ప్లాన్ ఏంటంటే !
on May 31, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -371 లో.... శివన్నారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్. తనతో పాటు దీప కూడా వస్తుంది. కార్తీక్ బాబుతో ఎందుకు అలా పని చేయించుకుంటున్నావని దీప అడుగుతుంది. నువ్వు బ్రతకడానికి నేనే సాయం చేసాను.. అందుకేనని జ్యోత్స్న అంటుంది. నా భర్త నా కోసం ఇదంతా చేస్తున్నప్పుడు.. నేను తన కష్టం పంచుకోవాలి కదా అని దీప అంటుంది.
నేను ఇక్కడే ఉండి ఇక నుండి పని చేస్తానని దీప అంటుంది. నీ మొహం చూస్తూ మేం ఎలా ఉంటాం వద్దని సుమిత్ర కోప్పడుతుంది. ఇంత అమాయకరాలివి ఏంటే దీప.. బావకి పని చెప్పేదే నిన్ను బాధపెట్టాడనికి, అలాంటిది నువ్వు కళ్లారా చూసి బాధపడుతా అంటున్నావని జ్యోత్స్న తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వద్దని శివన్నారాయణ అంటుంటే.. చెయ్యనివ్వండి తాతయ్య అని జ్యోత్స్న శివాణన్నారాయణని కన్విన్స్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఒప్పుకుంటారు.
ఆ తర్వాత దీప, కార్తీక్ బయటకు వస్తారు. నువ్వేంటి ఇక్కడ పని చేయడం ఏంటని కార్తీక్ అంటాడు. తప్పేముంది బాబు.. నా కన్నవాళ్ళకి చేస్తున్నానని దీప హ్యాపీగా చెప్తుంది. ఇప్పుడు అందరి దృష్టిలో నేను మోసగత్తెను కానీ నాకు తెలియకుండానే నా ఇంటి నుండి పొందాల్సినవి పొందానని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



