Brahmamudi : అప్పుని తిట్టేసిన ధాన్యలక్ష్మి.. యామిని కుట్ర అదే!
on May 31, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -735 లో....రాజ్, కావ్యలని గజదొంగ ఛార్లెస్ తాళ్లతో కట్టేస్తాడు. దాంతో రాజ్ తెలివిగా తన మోబైల్ ని తీసుకొని.. మీరు వెతుకుతున్న దొంగ ఇక్కడే ఉన్నాడని అప్పుకి మెసేజ్ చేస్తాడు. అది చూసిన అప్పు షాక్ అవుతుంది. వెంటనే కళ్యాణ్ కి చెప్పి కార్ ఆపుతుంది. ఇద్దరు కలిసి ఇంటికి బయల్దేర్తారు. రాజ్ అప్పటికే తెలివిగా తాళ్లని విప్పుతాడు దొంగని పట్టుకొని తాళ్లతో కట్టేస్తాడు.
అప్పుడే అప్పు, కళ్యాణ్ ఇంటికి రాగానే.. పై నుండి మూట కట్టి దొంగని కిందకి విసిరేస్తాడు. నువ్వు ఇంకొకసారి తప్పించుకుంటే నేనే నిన్ను చంపేస్తానని దొంగకి వార్నింగ్ ఇస్తుంది అప్పు. దొంగ ని కానిస్టేబుల్ కి అప్పగిస్తుంది. ఇప్పుడు మనం పైకి ఎలా వెళ్ళాలని అప్పు, కళ్యాణ్ ఆలోచిస్తుంటే.. నేను హెల్ప్ చెయ్యాలా అని ప్రకాష్ తాడు ఇస్తాడు. ఆమ్మో అత్తయ్య చూస్తుందని అప్పు భయపడుతుంది. అప్పుడే వాళ్ళని ధాన్యలక్ష్మి చూస్తుంది.
ఇంట్లో పెద్ద పంచాయతీ పెడుతుంది. ఇలా నువ్వు వెళ్ళేది కాకుండా నా కొడుకుని కూడా తిప్పుతున్నావా అని అప్పుని ధాన్యలక్ష్మి తిడుతుంది. అప్పు దొంగని పట్టుకోవడానికి వెళ్ళింది. ఆ దొంగ మనింట్లో దొరికాడు.. లేదంటే దొంగ వళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ అయ్యేదని కళ్యాణ్ చెప్పగానే.. ఇంట్లో అందరు అర్ధం చేసుకుంటారు. అందరు కలిసి రాజ్ కావ్యల దగ్గర కి వెళ్తారు. మాకు అప్పు, కళ్యాణ్ అంత చెప్పారని ఇందిరాదేవి అంటుంది. కావ్య బయటకు వస్తుంది. రాజ్ తన చెయ్ పట్టుకొని ఆపుతాడు. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతుంటే అప్పుడే రాజ్ కి ఫోన్ వస్తుంది. తరువాయి భాగంలో రాజ్ ని ఈ రోజు నా సొంతం చేసుకుంటాను.. బావకి నాకు శోభనం.. అలా అయితే బావ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని యామిని ప్లాన్ చేసి వాళ్ళ అమ్మ వైదేహితో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



