Illu illalu pillalu : కొత్త చీరలో భార్యని చూసి ఫ్లాట్ అయిన భర్త.. పెద్దోడి పెళ్ళి జరిగేనా!
on Apr 13, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -131 లో.... ఆ చందు గాడి పెళ్లి ఎలాగైనా ఆపాలని విశ్వ అనుకుంటాడు. ఒక అమ్మాయిని పిలిపించి నువ్వు ఒకరిని కిడ్నాప్ చెయ్యాలంటూ ప్లాన్ అంతా తనకి వివరిస్తాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది.
మరుసటి రోజు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి రామరాజు చూస్తాడు. వచ్చిన బంధువులని ఆహ్వానిస్తాడు. సాగర్, తిరుపతి ఇద్దరితో రామరాజు పెళ్లి పనుల గురించి చెప్తూ ధీరజ్ తో కూడా మాట్లాడతాడు. మాటల్లో ధీరజ్ భుజం పై చెయ్ వేస్తాడు. దాంతో ధీరజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రామరాజు మళ్ళీ చెయ్ తీసి ధీరజ్ వంక చూస్తూ వెళ్ళిపోతాడు. కానీ ధీరజ్ మాత్రం తన తండ్రి మాట్లాడాడన్న హ్యాపీ నెస్ లోనే ఉంటాడు. ధీరజ్ బయటకు వెళ్తాడు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందోనని అనుకుంటుంటే.. ఎవరని ధీరజ్ చూస్తాడు. తీరాచూస్తే ప్రేమ. ప్రేమ చీరకట్టులో అలా నడిచి వస్తుంది. ధీరజ్ ప్లాట్ అవుతాడు. వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడుకుంటుంటే.. ఇక్కడ నుండి వెళ్ళండి అంటూ పంపిస్తాడు. ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి.. ఏంటి జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. అదేం లేదని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ లోపలికి వస్తుంటే.. ధీరజ్ పడిపోబోతుంటే ప్రేమ పట్టుకుంటుంది.
ఆ తర్వాత శ్రీవల్లి రెడీ అవుతుంది. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. మేకప్ వేయడానికి మనిషిని మాట్లాడలేదని భాగ్యంతో శ్రీవల్లి అంటుంది. నువ్వు అందంగా ఉంటావ్.. మళ్ళీ మేకప్ ఎందుకని భాగ్యం అంటుంది. అప్పుడే విశ్వ పంపిన మేకప్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తుంది. నన్ను అబ్బాయి వాళ్ళు పంపారని తను చెప్పగానే నేనంటే మా బావకి ఎంత ఇష్టమోనని శ్రీవల్లి మురిసిపోతుంది. మేకప్ ఆర్టిస్ట్ భాగ్యం ఇంకా తన కూతురిని బయటకు వెళ్ళమంటుంది. వాళ్ళు బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



