Brahmamudi : రాజ్ ని ఫాలో అవుతూ వెళ్ళిన యామిని.. అత్త బర్త్ డేకి కోడలు గిఫ్ట్ ఇస్తుందా!
on Apr 13, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -694 లో.... కావ్యని కలవడానికి రాజ్ ఆఫీస్ కి వస్తాడు. ఎక్కడ ఆఫీస్ ఎంప్లాయిస్ రాజ్ ని చూస్తారోనని రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి తనని పక్కకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు ఇంత సడెన్ గా వచ్చారని కావ్య అనగానే.. చూడాలనిపించింది, మిమ్మల్ని చుస్తే నాకు ఇది వరకే పరిచయం ఉన్నట్లనిపిస్తుంది మీక్కూడా అలాగే అనిపిస్తుందా అని కావ్యని రాజ్ అడుగుతాడు. తను ఎక్కడ బయటపడుతుందోనని కావ్య అనుకొని నాకు వర్క్ ఉంది వెళ్తానంటు అక్కడ నుండి వెళ్ళబోతుంది. కావ్యని రాజ్ ఆపుతాడు. మీరు ఇప్పుడు చెప్పాలిసిందేనని రాజ్ అంటాడు. అయిన కావ్య మౌనంగా ఉంటుంది రాజ్ తీసుకొని వచ్చిన బోకే తనకు ఇస్తాడు.
మరొకవైపు యామిని జీపీఎస్ ద్వారా రాజ్ కార్ ఉన్న దగ్గరికి వస్తుంది. రాజ్ అక్కడ లేకపోయేసరికి ఆఫీస్ లోపలికి వెళ్తుంది. మరొక వైపు కావ్య వెళ్ళిపోగానే రాజ్ తిరిగి కార్ దగ్గరికి వస్తాడు. యామిని కార్ ఇక్కడ ఉందేంటని యామినికి ఫోన్ చేస్తాడు. నేను కార్ దగ్గరున్నా అనగానే వస్తున్నా బావ అని యామిని అంటుంది. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చావా అని రాజ్ అనగానే.. లేదు బావ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చానని కవర్ చేస్తుంది. రాజ్ ఇచ్చిన బొకే చూస్తూ కావ్య మురిసిపోతుంది.
రేపు వదిన బర్త్ డే కదా అని సుభాష్ తో ప్రకాష్ అంటాడు. రాజ్ ఉంటే గుడిలో అన్నదానం చేసేవాడని రుద్రాణి అంటుంది. నాకు వేటిపై ఇంట్రెస్ట్ లేదని అపర్ణ అంటుంది. ఒప్పుకోవచ్చు కదా వదిన అని ప్రకాష్ అంటాడు. ఇక ఎప్పటిలాగే రుద్రాణి ఏదో ఒకటి వాగుతుంటే ధాన్యలక్ష్మి చురకలేస్తుంది. అదంతా చూస్తున్న అప్పు.. పాపం బావ అక్కడ ఉంటే లేడనుకొని అత్తయ్య ఎంత బాధపడుతున్నారని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



