Illu illalu pillalu : ఇంటి పెత్తనం వద్దన్న శ్రీవల్లి.. ఇద్దరు కోడళ్ళ ప్లాన్ సక్సెస్!
on Aug 13, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -235 లో.......వేదవతిని తప్పుగా అపార్థం చేసుకున్నందుకు తనకి రామరాజు సారీ చెప్తాడు. వెళ్లి మొదటి ధాన్యం దేవుడి దగ్గర పెట్టమని రామరాజు చెప్పగా.. వేదవతి వెళ్లి రామరాజు చెప్పినట్లు చేస్తుంది. హమ్మయ్య వాళ్ళు కలిసిపోయారు.. నా వల్ల వాళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయని చాలా ఫీల్ అయ్యాను.. ఇప్పుడు రిలీఫ్ గా ఉందని ప్రేమ అంటుంది.
మనం ఇంకొకపని కూడా చెయ్యాలి.. ఇంటి పెత్తనం, బీరువా తాళాలు మళ్ళీ అత్తయ్య చేతికి వచ్చేలా చెయ్యాలని ప్రేమ, నర్మద ఇద్దరు అనుకుంటారు. అసలు రాత్రి దొంగ మన ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయారు.. వల్లి వాళ్ళ నాన్నే మన ఇంటికి వచ్చిన దొంగ ఒక్కరే అనిపిస్తుందని నర్మద అంటుంది. అవును అక్కా.. ఎవరైనా బర్త్ డే విషెస్ చెప్పడానికి దొంగ గెటప్ లో వస్తారా అని ప్రేమ అంటుంది. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఆనందరావుకి వినపడేలా రాత్రి దొంగని చూసాను కదా.. వల్లి వాళ్ళ నాన్నలాగే అనిపిస్తుందని అంటారు. అప్పుడే ఆనందరావు వాళ్ళ దగ్గరికి వస్తాడు. పాపం దొంగ ఎవరో గాని వల్లి అక్క ఇరుక్కుపోయింది. వల్లి అక్క దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గర ఎందుకున్నాయని పోలీసులు అడుగుతారు. అత్తయ్య దగ్గర ఉంటే ఇదంతా గొడవ ఉండేది కాదు.. పాపం వల్లి అక్క.. ఇంటి ముందు సీసీటీవీ ఉంది.. దొంగ ఎవరో తెలుస్తుందని ఆనందరావుని ఇద్దరు భయపెడతారు.
ఆ తర్వాత భాగ్యం, శ్రీవల్లి దగ్గరికి ఆనందరావు వెళ్లి సీసీటీవీ ఉందట.. వల్లి దగ్గరున్న తాళాలు దొంగ దగ్గర ఎలా వచ్చాయని అడుగుతారు కదా ఎందుకైనా మంచిది.. తాళాలు మీ అత్తయ్య గారికి ఇచ్చేయమని అతను అంటాడు. ఇవ్వనని శ్రీవల్లి అనగా భాగ్యం తనని ఒప్పిస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి తాళాలు తీసుకొని వెళ్లి.. ఇక నా దగ్గర వద్దని రామరాజుతో చెప్తుంది. మా కూతురు ఇంకా చిన్నపిల్ల.. తనకి ఇంత బాధ్యతలు ఎందుకని భాగ్యం అంటుంది. తరువాయి భాగంలో కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. నాకు నువ్వు గిల్టీ నగలు ఇచ్చావని శ్రీవల్లితో గొడవపడుతుంటే భాగ్యం సర్దిచెప్తుంది. అదంతా నర్మద, ప్రేమ చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



