Brahmamudi : అప్పు, కావ్య ప్రెగ్నెంట్.. ఎమోషనల్ అయిన కనకం!
on Aug 13, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -798 లో..... రాజ్ తో ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడతారు. కావ్యని నువ్వు అపార్థం చేసుకోవడం ఆపేయమని అంటారు. మరొకవైపు కళ్యాణ్ కవితలు రాసుకుంటుంటే అప్పు వచ్చి నాకు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు మామిడికాయలు దొరకవని కళ్యాణ్ అంటాడు. ఇక అంతలోనే కళ్యాణ్ కి అప్పు ప్రెగ్నెంట్ అన్న విషయం అర్థమై అప్పుని ఎత్తుకొని చుట్టుతిప్పుతాడు.
ఆ తర్వాత కళ్యాణ్ హాల్లోకి వెళ్లి అందరిని పిలుస్తాడు. ఆ విషయం ఎలా చెప్పాలో సిగ్గుపడతాడు. ఇందిరాదేవికి కళ్యాణ్ చెవిలో చెప్పగా తను అందరికి చెప్తుంది. ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్లిద్దరికి విషెస్ చెప్తుంటారు. ఏంటి పెద్ద వదినకి హ్యాపీగా లేనట్టుంది.. తన కొడుకుకి ముందు పెళ్లి అయింది కానీ వాళ్ళు కాకుండా వీళ్ళు వారసుడిని ఇస్తున్నారని బాధగా ఉన్నట్లుందని రుద్రాణి అనగానే అదేం లేదు నేను హ్యాపీగా ఉన్నానని అపర్ణ అంటుంది. కాసేపటి తర్వాత బిడ్డ పుట్టేవరకు జాబ్ మానెయ్ అని ధాన్యలక్ష్మి అనగానే సరే అత్తయ్య లాంగ్ లీవ్ తీసుకుంటానని అప్పు చెప్తుంది. ఇంట్లో ఉండడం కాదు నేను చెప్పినట్టు వినాలని ధాన్యలక్ష్మి అనగానే సరేనని అప్పు అంటుంది.
మరొకవైపు తను ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి చెప్పే సిచువేషన్ లో లేనని కావ్య బాధపడుతుంటే ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ధైర్యం చెప్తారు.ఆ తర్వాత కళ్యాణ్ అమ్మాయి పుట్టాలని.. అప్పు అబ్బాయి పుట్టాలని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అప్పు మామిడికాయ తింటూ కావ్య దగ్గరికి వచ్చి తినమని ఇస్తుంది. అది చూసిన రుద్రాణి.. ఏంటి నువ్వు తినాలి కానీ మీ అక్కకి ఇస్తున్నావ్.. మీ అక్క కూడా ప్రెగ్నెంటా ఏంటని అడుగుతుంది. వెంటనే అప్పు ఏదో చెప్పేసి కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో అల్లుడి గారితో ఎందుకు పెళ్లి వద్దన్నావని కావ్యని కనకం అడుగుతుంది. అది నా ఇష్టమని కావ్య అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరు అసలు విషయం కనకంకి చెప్తారు. ఆ విషయం తెలిసి కనకం కావ్య దగ్గరికి వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే రుద్రాణి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



