Illu Illalu Pillalu: ఎమోషనల్ అయిన ప్రేమ.. భాగ్యం చెప్పిన ప్లాన్ తో శ్రీవల్లి డ్రామా!
on Jul 20, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -215 లో.. భద్రవతి ఇంట్లో నగలు ఇచ్చి వస్తాడు తిరుపతి. తిరుపతి కోసం శ్రీవల్లి ఎదరుచూస్తూ ఉంటుంది. అతను రాగానే నగలు ఇచ్చారా ఏమన్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే.. ఎందుకు ఆలాగే అడుగుతున్నావని తిరుపతి అంటాడు. అదేం లేదని శ్రీవల్లి డైవర్ట్ చేస్తుంటే వెనకాలే ప్రేమ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది. అవి నీ నగలా.. ఎందుకు అలా అడుగుతున్నావని ప్రేమ అంటుంది. ఏంటి అలా అంటున్నావ్ ఇంట్లో సమస్య కాబట్టి అడిగానని చెప్పి శ్రీవల్లి అక్కడ నుండి వెళ్తుంది.
ఆ తర్వాత ఏదో తేడాగా ఉంది కొంచెం దృష్టి పెట్టాలని ప్రేమ అనుకుంటుంది. మరొకవైపు సాగర్ దగ్గరకి నర్మద వచ్చి పక్కన కూర్చుంటుంది. సాగర్ వెళ్ళిపోతుంటే నాతో మాట్లామని నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. అయిన సాగర్ కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీవల్లి భాగ్యానికి ఫోన్ చేసి ప్రేమ నగలల్లో నా నగలు పెట్టేసానని చెప్తుంది. ఇక ఇంట్లో నీదే రాజ్యం ఎవరికి బయపడాల్సిన అవసరం లేదని శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం.
ఆ తర్వాత ప్రేమ దగ్గరికి ధీరజ్ ఎంబీఏ ఫామ్ తో వస్తాడు. అది ప్రేమ చింపేస్తుంది. అది నీ డ్రీమ్ లైఫ్ అనీ ధీరజ్ అనగానే నిన్ననే నా లైఫ్ నాకూ అర్థం అయింది. నేనొక వస్తువుని.. నాకోసం నువ్వు ఎందుకు ఇదంతా చేయడమని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత చందు వర్క్ చేసుకుంటుంటే.. శ్రీవల్లి కోపంగా బట్టలు బ్యాగ్ లో సర్దుకొని బయటకు వస్తుంది. ఏమైందని చందు తన వెంటే వస్తాడు. ఇంట్లో అందరు వస్తారు. ఏమైందని రామరాజు అడుగుతాడు. నేను మా పుట్టింటికి వెళ్తున్నానని శ్రీవల్లి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



