భర్త నో అంటే నో..మొగుడు ఫోన్ వస్తే భయపడాలా
on Jul 21, 2025

ఈరోజున పెళ్లిళ్లు ఎలా ఉన్నాయి అంటే ఇలా పెళ్లి చేసుకోవడం విడిపోవడం. లేందంటే చంపడం చావడం అంతే తప్ప ప్రేమ, అర్ధం చేసుకునే గుణం ఇద్దరిలోనూ ఉండడం లేదు. దాంతో పెళ్లిళ్లు ఏవీ కూడా నిలబడడం లేదు. దీని మీద జ్యోతి రాజ్ తన ఇన్స్టాగ్రామ్ రీల్ లో స్పందించింది. "ప్రియమైన భావి యువ జంటలారా పెళ్లి చేసుకునేది విడిపోవడానికి కాదు. నా ఓన్ ఎక్స్పీరియెన్స్ ను ఒక విషయం చెప్పాలనుకుంటున్నది. విడిపోవడం పరిష్కారం కాదు. ప్రశాంతంగా ఉండటానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భర్త మీ నుండి ఏమి కోరుకుంటున్నారో దాన్ని గౌరవించండి. మంచి రిలేషన్ ఉండాలి అంటే సహనం, సానుభూతి , కమ్యూనికేషన్ అవసరం అంటూ చెప్పుకొచ్చింది. మా ఇద్దరినీ చూడగానే చాలామంది అనుకుంటారు ఎంత మంచి జంట అని. ఎప్పుడూ పక్కపక్కనే ఉంటారు, చక్కగా ఉంటారు.
మంచిగా దంచే చేస్తారు అనుకుంటారు. కానీ నేను ఆయన పక్కన డాన్స్ చేయడానికి ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడతాను అనేది నాకు మాత్రమే తెలుసు. ఇదేంమంతా ఈజీగా కాదు. చూసి అంత మంచి మొగుడు దొరికాడు నీకు ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు అంటారు కానీ ఆ మంచోడు ఎప్పుడంటే మనం తగ్గినప్పుడే.. ఆ మంచి వెనకాల చాలా త్యాగాలు ఉంటాయి. ఎన్నో కాంప్రమైజెస్ ఉంటాయి. మన వలన వాళ్ళు, వాళ్ళ వలన మనం తగ్గినా సందర్భాలు కూడా ఉంటాయి. అదంతా కూడా ప్రేమ, అర్ధం చేసుకోవడంలోనే ఉంటుంది. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి అయ్యాక మనం ఇంకా అతనికే సొంతం. వాళ్ళే ప్రపంచం. వాళ్ళు నో చెప్తే నో అంతే. డ్రెస్ బాలేదు అని నోటితో చెప్పకపోయినా కంటి చూపుతో చెప్తారు. అప్పుడు మనమే అర్ధం చేసుకోవాలి. వెంటనే చేంజ్ చేసేసుకోవాలి అంతే. 12 దాటింది రాత్రి అంటే మొగుడు ఫోన్ వస్తే భయపడాలా . ఎందుకంటే రెస్పెక్ట్ ఉండాలి. మంచోడు అని ఈజీగా చెప్పేస్తారు కానీ చాలా అండర్ స్టాండింగ్ ఉండాలి. " అంటూ జ్యోతి రాజ్ సందీప్ చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



