ENGLISH | TELUGU  
Home  » TV News

యూట్యూబ్ ట్రెండింగ్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!

on May 10, 2024


తెలుగు సీరియల్స్ లలో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కి రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. దానికి కారణం మంచి కథ. ఏ సీరియల్ అయిన కథ బాగుంటేనే సరైన హిట్ లభిస్తుంది. ఈ సీరియల్ లో సీతాకాంత్, రామలక్ష్మిల జంటకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

నిన్న మొన్నటిదాకా సిరి, ధనల ఇష్యూ సాగగా.. నేటి ప్రోమోలో అభి ఏకంగా ఇంటికే వస్తాడు. దాంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మాణిక్యం వన్ మ్యాన్ షోగా సీతాకాంత్ ఎత్తులు ఓవైపు.. శ్రీలత తెగింపు మరోవైపు సాగుతుంది. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.

నేటి ప్రోమోలో సందీప్, శ్రీలత సోఫాలో‌ కూర్చొని ఉంటారు. మీడియా వాళ్ళు కూడా వస్తారు. రామలక్ష్మి, సీతాకాంత్ పెళ్ళి చేసుకోలేదని సహజీవనం చేస్తున్నారని అంతకముందు రోజు టీవీలో రావడంతో.. మీడియాని పిలిచి నిజం చెప్పమని సీతాకాంత్ తో శ్రీలత చెప్తుంది. అయితే రామలక్ష్మి లెటర్ రాసి అభి దగ్గరికి వెళ్ళిపోతుంది. ‌ఇక సీతాకాంత్ తనకి నచ్చజెప్పి ఇంటికి తోసుకొస్తాడు. మీడియా వాళ్ళు, శ్రీలత, సందీప్ ఎదురుచూస్తుంటారు. రామలక్ష్మి రాదని శ్రీలత అనగానే.. పై నుండి రామలక్ష్మి, సీతాకాంత్ దిగి వస్తారు. అది చూసి శ్రీలత షాక్ అవుతుంది. " ప్రపంచమంతా మేమిద్దరం పెళ్ళి చేసుకున్నామని చెప్పాలన్నావ్ కదా అమ్మ.. అందుకే మేమ్ వచ్చాం " అని శ్రీలతతో సీతాకాంత్ అంటాడు. ఇది అసలైన ట్విస్ట్ గా నిలిచింది. దాంతో ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ ఏం జరుగుతుందా అనే ఇంటెన్స్ తో ఉత్కంఠభరితంగా మారింది. ఈ ప్రోమో ఇప్పటికే అత్యధిక వీక్షకాధరణ పొందింది.
 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.