ENGLISH | TELUGU  
Home  » TV News

ఛీ నీ బతుకు.. కలర్ స్వాతి షాకింగ్ కామెంట్స్!

on May 7, 2024

కలర్స్ స్వాతి నటిగా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అందరికి సుపరిచితమే. ఓ టీవీ ఛానెల్ లో కలర్స్ అనే ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేయడం.. అది హిట్ అవ్వడంతో తనకి కలర్స్ స్వాతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ నటించి అభిమానులని సొంతం చేసుకుంది. 
 
నటిగా స్వాతి మొదటి సినిమా ' డేంజర్'. ఆ తర్వాత 'అష్టా చెమ్మ' అనే సినిమాలో నటించగా.. అది విజయవంతం అవ్వడం వలన తనకి అనేక అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాకి గాను కలర్స్ స్వాతికి నంది పురస్కారం కూడా లభించింది . అగస్ట్ 30, 2018 న వికాస్ తో స్వాతి పెళ్ళి జరిగింది. ఆ తర్వాత తను సినిమాలకి దూరమైంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే , అనంతపురం, అష్టా చెమ్మ, త్రిపుర, కలవరమాయే మదిలో, సంఘర్షణ, మిరపకాయ్, స్వామిరారా, కార్తికేయ, లండన్ బాబులు లాంటి సినిమాలు చేసిన కలర్స్ స్వాతి.. పెళ్ళి తర్వాత సినిమాలకి దూరమైంది. ఇక గత సంవత్సరం మంత్ ఆఫ్ మధు సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. అయితే రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో , ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే కలర్స్ స్వాతికి ఓ చేదు అనుభవం ఎదురైంది.

కలర్స్ స్వాతి ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్స్ ఇస్తూ రెగ్యులర్ గా పోస్ట్ లు, స్టాటస్ లు పెడుతుంటుంది. తాజాగా కలర్స్ స్వాతి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీలో వీడియోలను షేర్ చేసింది. ఈ వీడియోకి ఓ నెటిజన్ కాస్త నెగెటివ్ కామెంట్ చేశాడు. ఛీ నీ బతుకు.. అని రిప్లై ఇచ్చాడు. ఆ కామెంట్‌ కు కలర్స్ స్వాతి ఘాటుగా స్పందించింది.  నాక్కూడా కొన్ని సార్లు అలానే అనిపిస్తుంది.. జీరో పోస్ట్‌ ఛాంపియన్స్ అంటూ కౌంటర్లు వేసింది. ఇలాగే గతంలో మంత్ ఆఫ్ మధు మూవీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చింది స్వాతి. ఇలాగే ఇప్పుడు స్వాతి చేసిన కామెంట్లు నెట్టింట  వైరల్ గా మారాయి.


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.