ENGLISH | TELUGU  
Home  » TV News

Brahmamudi : ఆ తప్పు చేసింది ‌కొడుకు‌ కాదు తండ్రి.. ఎవరూ ఊహించని మలుపు!

on May 7, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -403 లో..  కావ్యని తక్కువ చేసి రుద్రాణి మాట్లాడుతుంది. దాంతో సుభాష్ రుద్రాణిపై కోప్పడతాడు. పుట్టింట్లో ఉండి తింటున్నావ్ నా కోడలిని అనే అర్హత లేదని సుభాష్ అంటాడు. దాంతో రుద్రాణి నోరు మూసుకుంటుంది. ఆ తర్వాత నాతో కలిసి భోజనం చెయ్ మమ్మీ అంటూ రాజ్ అడుగుతాడు. అలాగే చేస్తాను అందరం హ్యాపీగా ఉందాం కానీ నువు బాబుని ఎక్కడ నుండి తీసుకొని వచ్చావో అక్కడే వదిలేసి రావాలని అపర్ణ అంటుంది. దానికి రాజ్ ఒప్పుకోడు. నాలో ఆకలి చచ్చిపోయిందని రాజ్ అంటాడు. నాలో అమ్మతనం కూడా చచ్చిపోయిందని అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత అప్పు ఇంకా ఫోన్ చెయ్యడం లేదేంటని కావ్య అనుకుంటుంది. అప్పుడే అప్పు ఫోన్ చేస్తుంది. నేను చెప్పిన పని చేసావా అని కావ్య అడుగుతుంది. చేశాను నీకు వీడియో పంపించానని అప్పు చెప్తుంది. త్వరగా కావ్య ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వీడియో డౌన్లోడ్ చేస్తుంటుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి సుభాష్ వచ్చి ఎందుకు నా వాళ్ళ ఇన్ని అవమానాలు భరిస్తున్నావని అడుగుతాడు. నిజం అమ్మకి తెలిస్తే బ్రతకదని రాజ్ అంటాడు. కానీ నువ్వు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళడానికి నేను ఒప్పుకోనని సుభాష్ అంటాడు. ఆ తర్వాత కావ్య వీడియో డౌన్లోడ్ చేసి చూస్తుంటుంది. అందులో రాజ్ కావ్య పెళ్లిరోజున రాజ్ ఆఫీస్ నుండి వెళ్తుంటే.. సుభాష్ ఉరివేసుకోబోతుంటాడు. అది చూసి రాజ్ ఆపి.. ఏమైందని అడుగుతాడు. ఎందుకు ఇలా చేస్తున్నారని? ఏమైందని అడుగుతాడు. అది ఎలాంటి ప్రాబ్లమ్ అయినా నేను తీరుస్తానని రాజ్ అంటాడు. నేను తప్పు చేసాను. మీ అమ్మకి అన్యాయం జరిగింది. నేను బ్రాంచ్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు అప్పుడే పీఏతో పరిచయం ఏర్పడి తప్పుకి దారితీసింది. ఇక అంత మర్చిపోయి ఎవరి జీవితం వారే ఉన్నాం. మళ్ళీ ఆ పీఏ మాయ మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఆ తప్పు కారణంగా ఒక బాబు పుట్టాడని చెప్పింది. బాబుని వారసుడిగా చేయకుంటే మీడియా ముందుకూ వస్తానంటూ బెదిరిస్తుందనగానే.. అది విని రాజ్ షాక్ అవుతాడు.

నేను ఆ ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేస్తాను. అమ్మకి గాని ఇంట్లో ఎవరికైనా ఈ విషయం చెప్తే నా మీద ఒట్టే అని రాజ్ మాట తీసుకుంటాడు. ఆ వీడియో అంతా కావ్య చూసి షాక్ అవుతుంది. ఆ బాబు మావయ్య గారి బాబా అని ఆశ్చర్యపోతుంది. మరోవైపు నిజం చెప్పు లేదంటే ఇంట్లో నుండి వెళ్లిపోయి.. మీ అమ్మకి దూరంగా ఉండగలవా అని సుభాష్ అంటాడు. నిజం చెప్పి అమ్మని దూరం చేసుకోలేనని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య బాధపడుతు.. తన కొడుకు తప్పు చేసాడని క్షమించలేదు అలంటిది మావయ్య తప్పు చేసాడని తెలిస్తే అత్తయ్య పరిస్థితేంటని కావ్య దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. తరువాయి భాగంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్న నేను ఒప్పుకుంటాను.. నేను నా భర్తతోనే వెళ్ళిపోతానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.