ENGLISH | TELUGU  
Home  » TV News

వందరోజులు పూర్తి చేసుకున్న బ్రహ్మముడి సీరియల్.. సెలబ్రేషన్స్ లో సీరియల్ యూనిట్!

on May 20, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి సీరియల్ గత ఆరు వారాల నుండి టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంటూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ కి ఇప్పుడు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ తో వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ సీరియల్ నటీనటులు, డైరెక్టర్ తో పాటు టెక్నికల్ టీం అంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా మానస్, కావ్యగా దీపిక రంగరాజు, స్వప్నగా హమీద‌, కనకంగా నీప, రుద్రాణిగా షర్మిత గౌడ, అపర్ణగా శ్రీప్రియ, అప్పుగా నైనిశా, ధాన్యలక్ష్మిగా మాధురి, కళ్యాణ్ గా కిరణ్ కాంత్ నటిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ని కుమార్(చింటు) పంతం డైరెక్టర్ చేస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ ని కూడా కుమార్ పంతం డైరెక్ట్ చేస్తుండటం విశేషం. రెండు సీరియల్స్ కి విభిన్న కథలని రాసుకుని వాటిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు కుమార్ పంతం. బ్రహ్మముడి సీరియల్ లో ఒక్కో పాత్రకి ఒక్కో ప్రత్యేకతను చూపిస్తూ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ కుమార్ పంతం‌. ఈ సీరియల్ లో దుగ్గిరాల ఫ్యామిలీ ధనవంతులుగా, కనకం-కృష్ణమూర్తిల ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబంగా కనిపిస్తుంటారు. దుగ్గిరాల వారసుడు రాజ్(మానస్) ని కనకం-కృష్ణమూర్తిల పెద్ద కూతురు స్వప్న(హమీద) కి ఇచ్చి పెళ్ళిచేద్దామని అనుకుంటే.. స్వప్న పెళ్ళిపీటల మీద నుండి రాహుల్ తో లేచిపోతుంది‌. దాంతో స్వప్న స్థానంలో.. కనకం తన రెండవ కూతురు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టి పెళ్ళి జరిపిస్తుంది‌. దాంతో రాజ్ వాళ్ళ అమ్మ కావ్యని కోడలిగా అంగీకరించదు. అలా ఈ కథ ముందుకు సాగుతుంది.

తాజాగా ఈ కథలో మరో ట్విస్ట్ వచ్చింది. రాహుల్ తో వెళ్ళిపోయిన స్వప్న మళ్ళీ తిరిగి కనకం-కృష్ణమూర్తిల ఇంటికి వచ్చేస్తుంది. దాంతో కనకం తనకి మళ్ళీ పెళ్ళిచేయాలని చూస్తుంటుంది. అయితే రాహుల్ తనని ట్రాప్ చేసాడని స్వప్న గ్రహించదు.‌ తననే గుడ్డిగా నమ్ముతూ కావ్యని అపార్థం చేసుకుంటుంది. అయితే స్వప్నకి రాహుల్ గురించి నిజం తెలుస్తుందా లేదా కావ్య తన తప్పేం లేదని రాజ్ ముందు నిరూపించుకుంటుందా అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతూ వందరోజులని పూర్తిచేసుకుంది. దీంతో ఈ సీరియల్ యూనిట్ అంతా కలిసి షూటింగ్ స్పాట్ లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వివరాలని  డైరెక్టర్ కుమార్(చింటు) పంతం తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.