ENGLISH | TELUGU  
Home  » TV News

హాట్ ఫోటోస్ తో పిచ్చెక్కిస్తున్న అరియాన!

on May 20, 2023

అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపొయింది అరియానా.. అరియానా మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియానా.


స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ  చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దాంతో అరియానా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు.అరియానా అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వళ్ళ అరియనాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని  అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియానా చాలా బాధపడింది.

అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత RGV తో కలిసి జిమ్ లో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఆ తర్వాత అరియానా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ఇలా అరియనా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. బిగ్ బాస్-5 బజ్ కి  ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అరియానా పాపులర్ అయింది. ఇంటర్వ్యూలో అరియానా కంటెస్టెంట్ తో సూటిగా మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది.

అరియానా తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. అరియనా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఫాన్స్ తో కాసేపు ముచ్చటించింది.. అందులో వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెప్తూ ఫాన్స్ ని ఖుషి చేసింది అరియాన. అంతే కాకుండా తన ఇన్ స్టాగ్రామ్ లో  రెడ్ డ్రెస్ తో దిగిన కొన్ని హాట్ ఫొటోస్ ని షేర్ చేసింది అరియాన. "జస్ట్ బి యూవర్ సెల్ఫ్.. దేర్ ఈజ్ నో వన్ బెటర్" అనే కాప్షన్ తో ఈ పోస్ట్ ని షేర్ చేసింది అరియాన. అయితే తను ఇలా కనిపించేసరికి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్ కామెంట్స్ తో మరికొందరు నెగెటివ్ కామెంట్స్ తో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే దేనికైనా బయటపడకుండా ధైర్యంగా ఎదుర్కునే అరియాన.. ఈ కామెంట్లకి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.


 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.