Brahmamudi : ఏసీబీకి చిక్కిన కావ్య చెల్లి.. రాజ్ ప్రపోజ్ చేయకుండానే తను వెళ్ళిపోయిందిగా!
on Jul 10, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -769 లో...... రాజ్ పై నుండి కిందకి వస్తుంటే అందరు షాక్ అవుతారు. రాజ్ కిందకి వచ్చి పనిమనిషి వంట బాగా చెయ్యలేదని మాట్లాడుతుంటే.. ఒక్క క్షణం అందరికి రాజ్ కి గతం గుర్తు వచ్చిందేమో అనుకుంటారు. ఏంటి అలా మాట్లాడుతుంటే భయపడ్డారా అని రాజ్ కామెడీ చేస్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఆఫీస్ కి బయల్దేరతారు. రాజ్, కావ్య ఆఫీస్ లోపలకి వెళ్తుంటే.. కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి.. నేను వస్తానని రాజ్ ని పంపిస్తుంది కావ్య.
ఎప్పటిలాగే ఈసారి నువ్వు ఓడిపోతున్నావ్.. మీటింగ్ అవ్వగానే నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని యామిని అంటుంది. దాంతో మళ్ళీ ఏదో ప్లాన్ చేసిందని కావ్యకి అర్ధమవుతుంది. స్వప్నకి ఫోన్ చేసి అక్కడ అంత ఒకే కదా అని అడుగుతుంది. ఒకే అని స్వప్న అనగానే సరేనని అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య. అక్కడ సిచువేషన్ ఒకేనా కావ్య అడుగగా.. ఒకే అక్క అని అప్పు అంటుంది.
ఆ తర్వాత యామిని మనుషులు అప్పు తమని లంచం అడిగిందని రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తామని ఏసీబీ వాళ్ళకి చెప్పి అప్పు దగ్గరికి వెళ్తారు. ఇద్దరు రౌడీలు అప్పు దగ్గరికి వెళ్లి మేడమ్ వాడికి మీ చేతుల మీదుగా డబ్బు ఇవ్వండి అని అతను అనగానే అప్పు సరే అంటుంది. అప్పుడే ఏసీబీ వాళ్ళు వచ్చి అప్పు లంచం తీసుకుంటుందని సస్పెండ్ చేస్తారు. కోర్ట్ లో కలుద్దామని వాళ్ళు అంటారు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లి మీటింగ్ లో మాట్లాడతాడు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుంటే కావ్యకి యామిని ఫోన్ చేసి మీ చెల్లి సస్పెండ్ అయిందని చెప్తుంది. దాంతో కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది. నువ్వు ప్రపోజ్ చేస్తుంటే వెళ్ళిపోయిందంటే కావ్యకి నువ్వంటే ఇష్టం లేదని రాజ్ తో యామిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



