Bigg boss 9 telugu: నాలుగో వారం డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే!
on Oct 4, 2025

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వీక్ ఓటింగ్ ఎప్పటికప్పుడూ మారిపోతుంది. టాస్క్ లు, ఆర్గ్యుమెంట్ల కారణంగా కంటెస్టెంట్ల గ్రాఫ్ పెరుగుతుంది. కొంతమందిది తగ్గుతుంది.
నాలుగో వారం నామినేషన్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. ముగ్గురు సెలబ్రిటీలు. ముగ్గురు కామనర్స్. సెలబ్రిటీలు సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి కాగా.. కామనర్స్ శ్రీజ దమ్ము, దివ్య నిఖిత, హరిత హరీష్. వీళ్లలో ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. సంజనకి ఓటింగ్ భారీగా పడుతోంది. ఎందుకంటే హౌస్ లో తను కంటెంట్ ఇస్తుంది. దొంగతనం పేరుతో తోటి హౌస్ మేట్స్ తో ఓ ఆట ఆడుకుంటుంది సంజన. అందుకే తనకి అత్యధికంగా ఇరవై ఒక్క శాతం ఓటింగ్ పడుతోంది. దమ్ము శ్రీజ, రీతు చౌదరికి కూడా ఓటింగ్ బాగానే ఉంది. టాస్క్ లో ఆడటంతో వీళ్ల ఓటింగ్ తారుమారైంది.
శ్రీజ 18 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉండగా.. రీతు 16 శాతం ఓట్లతో మూడో ప్లేస్ లో ఉంది. రీతూకు డీమాన్ పవన్ ఓటింగ్ కూడా కలిసొస్తుంది. దివ్య నిఖిత కూడా 16 శాతం ఓటింగ్ తో నాలుగో ప్లేస్ లో ఉంది. ఇక మిగిలింది హరిత హరీష్, ఫ్లోరా సైనీ. వీరిలో ఫ్లోరా సైనీకి ఓటింగ్ బాగుంది. కానీ కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన మాస్క్ మ్యాన్ హరీష్ కి తక్కువ ఓటింగ్ ఉంది. అతనే చివరి స్థానంలో ఉన్నాడు. అతనే ఈ వారం ఎలిమినేషన్ అయ్యేలా ఉన్నాడు. హౌస్ లో పెద్దగా ఎవరితో మాట్లాడకపోవడం వల్లే అతనికి స్క్రీన్ స్పేస్ లేదు. పైగా నెగెటివ్ గా మాట్లాడుతుండటం అతనికి పెద్ద మైనస్. దానివల్ల అతనికి ఓటింగ్ పడటం లేదు. మరి ఈ వారమ ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



