Brahmamudi: బిడ్డ కోసం భర్తని వదులుకోవడానికి భార్య సిద్ధం.. సూపర్ ట్విస్ట్!
on Oct 5, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -843 లో... రాజ్ పై కావ్య కోప్పడుతుంది. రాజ్ జ్యూస్ లో టాబ్లెట్ కలిపాడని చెప్పబోతు ఆగిపోతుంది. ఏంటి ఆగిపోయావ్ నేను నిజంగానే జ్యూస్ లో టాబ్లెట్ కలిపాను.. ఇప్పుడు ఏం చేస్తావని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు.
నేను నీ భర్తగా చెప్తున్నాను.. నువ్వు ఆపరేషన్ కి ఒప్పుకోమని రాజ్ అంటాడు. మీరు ఏ అధికారంతో నా బిడ్డని వద్దని అంటున్నారు. మీకు ఈ బిడ్డ అడ్డు అయితే నేను మిమ్మల్ని వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కావ్య అంటుంది. నాకు మీరు అవసరం లేదని కావ్య మాట్లాడుతుంటే అందరు షాక్ అవుతారు.
ఆ తర్వాత నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావు.. రాజ్ అంటే ఎంత ఇష్టం.. వాడిని వదిలేసి విడాకులు ఇస్తా అంటున్నావేంటని కావ్యతో అపర్ణ అంటుంది. ఆయనని విడిచి నేను ఉండలేను.. ఏదో బెదిరిస్తున్నా అంతే.. అప్పుడయినా నిజం చెప్తాడని అని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పు ఏడుస్తూ ఇదంతా మనవల్లే అని కళ్యాణ్ తో అంటుంది.
మరొకవైపు కోడలు గురించి సుభాష్ ఆలోచిస్తాడు. తనకి చెస్ట్ లో పెయిన్ గా ఉంటే అపర్ణ వచ్చి టాబ్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి.. ఎందుకు విడాకులు ఇస్తానంటున్నావని అడుగతుంది. ఇదంతా నాటకమని అప్పుకి కూడా తెలియొద్దని కావ్య అనుకుంటుంది.
తరువాయి భాగంలో అప్పు భోజనం చెయ్యడానికి రాదు.. కావ్య తిట్టింది అందుకే రావట్లేదని రుద్రాణి అనగానే కావ్యని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



