రతిక, అమర్ దీప్‌ల వరెస్ట్ బిహేవియర్.. పట్టువదలని విక్రమార్కునిగా రైతుబిడ్డ!
on Sep 30, 2023
మనల్ని విమర్శించినోడికి మన గెలుపనేది సమాధానం. మనల్ని కించపరిచేవాడికి మన గెలుపనేది చెప్పు దెబ్బలాంటింది. అలాంటిదే నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. రతిక, అమర్ దీప్ కలిసి వీడేంత అని కించపరుస్తూ హేళన చేసినవాళ్లకి గెలిచి చూపించి తిరుగులేని సమాధానం, తిరిగి ఎవరు అనలేని సమాధానం చెప్పాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌజ్ లో నాల్గవ వారం హౌజ్ మేట్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అసలు టాస్క్ ఏదైన , గెలవాలనే కసితో గెలిచి చూపించాడు పల్లవి ప్రశాంత్. చుట్టూ గుంట నక్కల్లా.. వస్తే శుభశ్రీకి లేదా యావర్ కి రావాలి కానీ పల్లవి ప్రశాంత్ కి రాకూడదని టాస్క్ ముందు నుండి ఈ సీరియల్ బ్యాచ్ లు ప్లాన్ లు వేసుకుంటున్నారు.
ఇక టాస్క్ లో పవరస్త్రని పట్టుకొని నిల్చోమని బిగ్ బాస్ చెప్పగా శుభశ్రీ, యావర్, ప్రశాంత్ పట్టుకొని నిల్చున్నారు. అయితే రతిక, అమర్ దీప్ ఇద్దరు కలిసి శుభశ్రీ, యావర్ ని డిస్టబ్ చేయకుండా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. అసలు అక్క అని ఎలా అంటావ్? లక్కీ ఛామ్ బ్యాండ్ కట్టి క్లోజ్ అయి ఇప్పుడు ఈ కథలేంటని అమర్ దీప్ అనగా.. అసలు ఏముంది ఇక్కడ మట్టి, మట్టి తప్ప ఏం లేదంటూ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడింది రతిక. నా ప్రాపర్టీ అని ఎలా అంటావని, బొచ్చు తప్ప ఏం లేదు, సిగ్గు శరం ఏం లేదు, మీ అమ్మ అయ్య ఇట్లనే పెంచిర్రా అని రతిక ఎంత అన్నా సరే పల్లవి ప్రశాంత్ అసలు కదలలేదు. ఇక కాసేపు రతిక, అమర్ దీప్ ఇద్దరు ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడిన చలించలేదు పల్లవి ప్రశాంత్.
పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాడు పల్లవి ప్రశాంత్. పొడిచిన కాకుల్ని గెలుపు రాయితో కొట్టాడు. గెలిచాక ఆ గెలుపుని శివాజీ పాదాలకి మొక్కి షేర్ చేసుకున్నాడు. గురుదక్షిణ ఇచ్చాడు. నువ్వు ఎంత గెలిచినా సింపుల్ గా ఉండు, గొడవలకు పోకు, నీ ఆట నువ్వు ఆడు, ఆడి గెలువు, గెలిచే వెళ్ళు అని ప్రశాంత్ తో శివాజీ అన్న మాటలు.. ఒక శిష్యుడికి గురువు చెప్పే మోటివేషనల్ మాటల్లా అనిపించాయి. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి, ఒక రైతుబిడ్డ తల్చుకుంటే ఎంత సహనాన్ని భరిస్తాడో, గెలవడం కోసం ఎన్ని అవమానలు భరిస్తాడో అన్నీ భరించాడు. ఎప్పుడు తొక్కేద్దామనుకునే సీరియల్ బ్యాచ్ కి తనేంటో నిరుపించుకుంటూ గెలిచి చూపించాడు పల్లవి ప్రశాంత్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
