నాల్గవ హౌజ్ మేట్ గా పల్లవి ప్రశాంత్.. సీరియల్ బ్యాచ్ కి మొదలైన కడుపు మంట!
on Sep 30, 2023
బిగ్ బాస్ సీజన్ ఇప్పటికే మూడు వారాలు పూర్తిచేసుకోగా, ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు.ఇక నాల్గవ వారం వీకెండ్ కి వచ్చేసింది టాస్క్. శివాజీ, శోభా శెట్టి, ఆట సందీప్ ముగ్గురు ఇప్పటికే హౌజ్ మేట్స్ అయ్యారు. ఇక నాల్గవ వారం హౌజ్ మేట్ కోసం జరుగుతున్న టాస్క్ ఆసక్తికరంగా సాగింది.
అయితే నాల్గవ హౌజ్ మేట్ కోసం వారమంతా టాస్క్ లు అయ్యాయి. అయితే చివరి రెండు రోజుల్లో బజర్ గేమ్ లో అంకెలు తారుమారయ్యాయి. అమర్ దీప్ చేతిలో నుండి ప్రిన్స్ యావర్ కి మారింది. ఇక పల్లవి ప్రశాంత్ కి యావర్ అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత గ్లాస్ లో కన్నీళ్ళు నింపే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ అందరి కన్నా ముందు కన్నీటి నింపి.. ఏడ్వడంలో పల్లవి ప్రశాంత్ ని మించి ఎవరు చేయలేరనేంతలా ప్రాణం పెట్టి చేశాడు. ఇక అతని ఏడుపు చూసి శుభశ్రీ అయితే ఫిధా అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు నాల్గవ పవరస్త్రకి పోటీలో నిల్చున్నారు. మూడవ పోటీదారుడి కోసం బిగ్ బాస్ ర్యాంప్ వాక్ చేయగా అందులో శుభశ్రీ .. చక్కని కాస్ట్యూమ్స్ తో సంచాలకులుగా వ్యవహరిస్తున్న ఆట సందీప్, శుభశ్రీ, శివాజీ తనే గెలిచిందని చెప్పారు. ఒక తర్వాత ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ ముగ్గురికి నాల్గవ పవరస్త్ర కోసం 'పట్టు వదలకు డింభక' అనే టాస్క్ ని ఇచ్చాడు. పవరస్త్రని ముగ్గురు తమ ఒక చేతితో పట్టుకోవాలి, ఎవరైతే ఎక్కువ సేపు ఉంటారో వారే విజేత అనగా.. ముగ్గురు దాదాపు మూడు గంటలు అలా పట్టుకొని నిల్చున్నారు. ఇక కాసేపు హౌజ్ లోని కంటెస్టెంట్స్ చేత డిస్టబ్ చేయించాడు బిగ్ బాస్. అయిన ముగ్గురు అలాగే స్ట్రాంగ్ గా ఆ పవరస్త్రాని పట్టుకునే ఉన్నారు. ఇక ఇలా కాదని ఆ టాస్క్ రద్దు చేసిన బిగ్ బాస్ మరొక టాస్క్ ఇచ్చాడు.
'కదలకురా వదలకురా' అనే టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఎవరైతే తమ చేతితో స్టాండ్ మీద ఉన్న పవరస్త్రని ఎక్కువ సమయం బ్యాలెన్స్ చేస్తారో వారే విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాస్క్ మొదలైన కాసేపటికి యావర్ పవరస్త్ర పడిపోయింది. మరికాసేపటికి శుభశ్రీ పవరస్త్ర కిందపడిపోయింది. అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేసేవరకు పల్లవి ప్రశాంత్ ఆ పవరస్త్ర కిందపడకుండా చూసుకున్నాడు. ఇక నాల్గవ పవరస్త్రని సాధించి రెండు వారాల ఇమ్యూనిటిని పొందడంతో పాటు నాల్గవ హౌజ్ మేట్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడని బిగ్ బాస్ చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సీరియల్ బ్యాచ్ కి కడుపు మంట మొదలైనట్డుగా స్పష్టంగా తెలిసిపోతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
