వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...
on Dec 6, 2025

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.
సుమ ఏమో "మరిది నిజం చెప్పు" అంది. "నాకు అంత సీన్ లేదక్కా" అన్నాడు. నీకు షోల్డర్ లో బోన్ గ్రోత్ ఆ లేదంటే ఎవరైనా విరగ్గొట్టారా" అని అడిగేసింది. "లేదు లేదు మీకు తెలీదా వాళ్ళావిడ కొడితే వెళ్లి కుట్లు వేయించుకున్నాడు తెలీదా మీకు" అంటూ మానస్ నిజం చెప్పేసాడు. అమరదీప్ ఒక చేతికి బాగ్ వేసుకుని వచ్చాడు. "నీ స్టోరీ బానే ఉంది" అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. సరే నీ స్టోరీ చెప్పు ఇప్పుడు అంటూ అఖిల్ ని అడిగింది సుమ. "ఫైవ్ ఇయర్స్ అయ్యింది బ్రేకప్ అయ్యి నాకు..కానీ ఇంకా ఆ బాధ తగ్గట్లేదు" అన్నాడు అఖిల్. "ఏంటి ఆ రియాలిటీ షో తర్వాత బ్రేకప్పేనా " అని అడిగింది. "రియాలిటీ షోకి ముందక్కా" అని కవర్ చేసాడు అఖిల్. వెంటనే సుమ అఖిల్ దగ్గరకు వెళ్లి "అఖిల్ నీ చెయ్యి చూపించు నాకు జాతకం కూడా చెప్పడం వచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అన్నావుగా ఆ అమ్మాయి గుజరాతి అమ్మాయే కదా..నీ జాతకం ప్రకారం నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్ళైపోతుంది " అంది. "మోస్ట్లీ అనుకుంటున్నా" అన్నాడు. ఆ అమ్మాయి కచ్చితంగా మన స్టేట్ ఐతే కాదు. ఆ అమ్మాయి మన స్టేట్ కాకపోయినా మన పండుగలన్నీ చాలా ఇష్టం.. ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీ అమ్మాయే" అని చెప్పేసరికి "మన స్టేట్ కాదు. మన పండగలు చేస్తుంది కానీ మన ఇండస్ట్రీ అన్న విషయం నేను చెప్పలేను" అన్నాడు అఖిల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



