కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్న తనూజ.. ఎందుకింత సపోర్ట్?
on Dec 6, 2025

బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. ఈ వారం తర్వాత మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ పడాల గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్-9 గా నిలిచాడు. అయితే కళ్యాణ్ గెలవడం వెనుక తనూజ సపోర్ట్ ఉందనేది ఎవరు కాదనలేని నిజం.
నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ గేమ్ ఆడారు. ఇందులో తనూజ తన సపోర్ట్ ని కళ్యాణ్ కి ఇచ్చింది. అయితే గేమ్ మొదలవ్వగానే వార్నింగ్ ఇచ్చిన్నట్టుగా ఓ స్టేట్ మెంట్ ని పాస్ చేసింది తనూజ. కళ్యాణ్‌ని ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్లని టార్గెట్ చేస్తానని తనూన చెప్పింది. అయితే అప్పుడే కళ్యాణ్‌ని డీమాన్ టార్గెట్ చేయడంతో రీతూని తనూజ టార్గెట్ చేసింది. అది గమనించిన రీతూ.. వద్దు డీమాన్ అంటు చెప్పింది. కానీ భరణి మరో ఎండ్ లో రీతూని టార్గెట్ చేయడంతో తను ఆ గేమ్ లో ఓడిపోయింది. దాంతో రీతూ ఎమోషనల్ అయింది. ఇద్దరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు పవన్ అంటూ రీతూ ఏడ్చింది. అయితే కళ్యాణ్ కి తనూజ సపోర్ట్ వెనకాల ఓ పెద్ద ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే.. ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ స్టేజ్ మీదకి వచ్చి టాప్-5 ఎవరో పెట్టారు. అందులో చాలామంది తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ పేర్లు చెప్పారు. ఇక వీరిద్దరిని మంచి చేసుకుంటే తనూజకి నెగెటివ్ గా ఉన్న ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ ఎఫర్ట్స్ చూసిన నెటిజన్లు తనకి ఫుల్ సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. ఇక ఫైనలిస్ట్ అవ్వగానే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పడాల ఓ మిలటరీ మ్యాన్ కాబట్టి ఆ రకంగా కూడా తనకి ప్లస్. అందుకే తనూజ అతనికి సపోర్ట్ చేసింది. అయితే ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్ ముగ్గురు టాప్-5 లో కన్ఫమ్. ఎందుకంటే ఇప్పుడున్న వారిలో వీళ్ళే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇక ఆ తర్వాత భరణి ఉంటాడు. ఇక అయిదో స్థానం ఇంకా కన్ఫమ్ అవ్వాల్సి ఉంది. ఈ వారం ఎలిమినేషన్ తర్వాత ఎవరెవరు టాప్-5 లో ఉంటారో తెలుస్తుంది. సోషల్ మీడియాలో తనూజ వర్సెస్ పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్ వార్ జరుగుతోంది. వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



