Dammu Srija: నీ రోత ఆపు అక్క.. దమ్ము శ్రీజకి తనూజ ఫ్యాన్ వార్నింగ్!
on Dec 6, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో దమ్మున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది దమ్ము శ్రీజ.. బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా గొడవ కోసం ఏదైనా పాయింట్ తో వెళ్తారు. కానీ తనూజ మాత్రం గొంతుతో వెళ్తుంది. అంటే ప్రతీసారీ గట్టి గట్టిగా అరుస్తూ మీదకి వెళ్ళిపోతుంది.
అసలు ఇప్పుడు శ్రీజ గురించి ప్రస్తావన ఎందుకంటే తనని ఓ నెటిజన్ దారుణంగా తిట్టాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీజ కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఫైర్ బ్రాండ్ లా నిలిచింది. ఇక సడెన్ గా తను ఎలిమినేట్ అయ్యింది. అంటే ఆడియన్స్ ఓటింగ్ కాకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నిర్ణయం వల్ల బయటకు వచ్చింది. ఇక హౌస్ లో నుండి ఎలిమినేట్ అయ్యాక తనకి విపరీతమైన పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. ఎందుకంటే తనది నిజంగా అన్ ఫెయిర్ ఎలిమినేషన్. ఇక తనని రీఎంట్రీ చేపించాలని సోషల్ మీడియాలో ఫుల్ పోస్ట్ లు చేశారు నెటిజన్లు. ఇక రీఎంట్రీ ఇస్తుందనగా తనతో పాటు భరణిని కూడా తీసుకొచ్చాడు బిగ్ బాస్ మామ. ఇక ఇద్దరిలో పోటీపెట్టి భరణిని హౌస్ లో రీఎంట్రీ కన్ఫమ్ చేసి శ్రీజని బయటకి పంపించేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు సీజన్-9 తుదిదశకు చేరుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్ టాప్-3 జాబితాలో ఉన్నారు. అయితే సీజన్-9 విన్నర్ ఎవరనే బజ్ ఎక్కువగా కళ్యాణ్, తనూజల మధ్య సాగుతోంది.
.webp)
తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తిడుతూ పోస్ట్ లు చేస్తున్నారు. అయితే ఇది ఏ రేంజ్ లో ఉందంటే సీజన్-9 కంటెస్టెంట్స్ నే డైరెక్ట్ గా తిట్టేంత దాకా వచ్చేసింది. అదేంటంటే దమ్ము శ్రీజ తాజాగా కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి చాలా షేర్లు, కామెంట్లు, లైక్స్ వచ్చాయి. అయితే ఇందులో ఓ కామెంట్ మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది. అయితే ఆ కామెంట్ కి దమ్ము శ్రీజ రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నీ రోత ఆపు అక్క.. తనూజ సపోర్ట్ లేనిదే కళ్యాణ్ టికెట్ టూ ఫినాలే గెలవలేదు.. కెప్టెన్ కూడా కాలేదు.. తనూజ సపోర్ట్ ఉండటం వల్లే ఈ రోజు టికెట్ టూ ఫినాలే గెలిచాడు.. మైండ్ ఇట్ అని ఓ కామెంట్ చేశాడు. ఇది తనూజ అభిమాని చేసిన కామెంట్ అని తెలుస్తోంది. కాబట్టి దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది దమ్ము శ్రీజ. "ఇక్కడ ఎందుకు చెప్తున్నావ్ అది.. డబ్బులు వచ్చాయా ఇక్కడ కామెంట్ పెట్టమని" అని దమ్ము శ్రీజ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక దీనికి ఆ నెటిజన్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పడాలకి దమ్ము శ్రీజ సపోర్ట్ చేస్తుంది కాబట్టి తనూజ ఫ్యాన్స్ అంతా ఇలాగే రియాక్ట్ అవుతారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



