బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో కూడా తెలీదు
on Feb 4, 2025
బుల్లితెర మీద వర్షిణి అంటే తెలియని వారు ఉండరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వర్షిణి ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లోనూ నటించినా వర్షిణికి పేరు రాలేదు. శంభో శివ శంభో చిత్రంలో చిన్నరోల్ చేసింది. ఐతే ఆమె నటించిన లవర్స్, కాయ్ రాజా కాయ్, బెస్ట్ యాక్టర్స్ వంటి మూవీస్ ఆమెకు పెద్దగా పేరు తెచ్చపెట్టలేదు. 'ఢీ' షోలో మెంటర్‌గా పని చేసింది ఆ తర్వాత 'పటాస్' షోతో వర్షిణి యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి ఈ అమ్మడు పలు ఛానెళ్లలో ప్రసారమైన ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ వస్తోంది.
'కామెడీ స్టార్స్' షో తర్వాత హోస్టింగ్‌కు గ్యాప్ ఇచ్చింది. తర్వాత సమంత నటించిన 'శాకుంతలం'లో వర్షిణి కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు వర్షిణి చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. టీవీలో కొన్ని షోలలోనూ కనిపిస్తూనే ఉంటోంది. ఐతే బిగ్ బాస్ కి వెళ్తారా అన్న ప్రశ్నకు..అసలు అది తెలీదు. ఎప్పుడు వెళ్తానో కూడా ఏమీ అనుకోలేదు. చాలా సార్లు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు నన్ను రమ్మని పిలిచారు కానీ నేనే వెళ్ళలేదు. బిగ్ బాస్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. వెళ్ళడానికి ముందు ధైర్యం సరిపోలేదు అని చెప్పింది. ఏ చిన్న పండగ వచ్చినా కూడా స్టార్ మాలో కానీ జీలో కానీ ఎదో ఒక షోకి హోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఐతే సుధీర్ తో లేదంటే రవితో హోస్టింగ్ చేస్తూ కనిపిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
