Brahmamudi : డబ్బు కాజేయాలనుకుంది రాహుల్ అని తెలుసుకున్న రాజ్.. కుమ్మేసాడుగా!
on Feb 4, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -636 లో....రాజ్, కావ్య కలిసి క్లయింట్ ఇచ్చిన డబ్బు లెక్కిస్తూ ఉంటారు. అనవసరం అయిన డౌట్స్ అడుగుతు.. కావ్య రాజ్ కి చిరాకు తెప్పిస్తుంది. ఈ డబ్బు దాచిపెట్టమని కావ్యకి రాజ్ చెప్తాడు. అదంతా రాహుల్ చూసి వీళ్ళ దగ్గర రెండు కోట్లు ఎక్కడివి అనుకుంటాడు. మరొకవైపు నీ మాటలు వింటే అందరి ముందు నా పరువు పోతుందంటూ రుద్రాణిపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది.
అప్పుడే స్వప్న వచ్చి.. ధాన్యలక్ష్మితో పాటు తను కూడా రెండు మాటలు అంటుంది. కాసేపటికి రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి.. రాజ్, కావ్యల దగ్గర రెండు కోట్లు ఉన్నాయని చెప్తాడు. వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని రాహుల్ కి రుద్రాణి ప్లాన్ చెప్తుంది. మరుసటి రోజు రాజ్, కావ్య ఆఫీస్ కి వెళ్తారు. రుద్రాణి, రాహుల్ లు తన మనుషులని రప్పిస్తారు. వాళ్ళు రుద్రాణి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. అందరు హాల్లోకి వస్తారు. నాకు ఈ రుద్రాణి రెండు కోట్లు ఇవ్వాలని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. అంత డబ్బు ఎందుకు తీసుకున్నావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. షేర్ మార్కెట్ లో పెట్టాను.. లాస్ వచ్చిందని రుద్రాణి చెప్తుంది. నా డబ్బు కట్టు అంటూ రుద్రాణి మనుషులు రుద్రాణిని బెదిరిస్తారు. దాంతో రాజ్ నువ్వు ఏదో ఒకటి చేసి కట్టమని రుద్రాణి రిక్వెస్ట్ చేస్తుంది. అంత డబ్బు లేదని రాజ్ కావ్య చెప్పేసి వెళ్లిపోతారు.
వాళ్ళు డబ్బు కట్టాలి.. లేదంటే ఏం చేస్తామో తెలియదని రుద్రాణి మనుషులు బెదిరించి వెళ్ళిపోతారు. దాంతో అన్నయ్య నువ్వు ఎలాగైనా రాజ్ తో మాట్లాడమని సుభాష్ ని రుద్రాణి రిక్వెస్ట్ చెయ్యగానే.. తను సరే అంటాడు. రాజ్ , కావ్యలు రుద్రాణి గురించి మాట్లాడుకుంటారు. రాహుల్ దగ్గరికి ఒక రౌడీ వస్తాడు. నేను చెప్పినట్లు రాజ్, కావ్య వాళ్ళ కార్ లో డబ్బు బ్యాగ్ ఉంది. అది తీసుకొని నా కార్ లో విసిరేసి వెళ్ళమని చెప్తాడు. తరువాయి భాగంలో రౌడీ రాజ్ కార్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని రాహుల్ కార్ లోకి విసిరేస్తాడు. దాంతో రాజ్ రౌడీ ని పట్టుకొని ఎవరు చేయించారని అడుగగా.. రాహుల్ పేరు చెప్తాడు. ఇంటికి వచ్చి రాహుల్ ని రాజ్ కొడతాడు. రుద్రాణి రప్పించిన మనుషులని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
