Prabhas: ప్రభాస్ ని రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టిన డైరెక్టర్!
on Jan 23, 2026

టాలీవుడ్ లో సంచలనంగా మారిన న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఎండలో నిలబెట్టిన డైరెక్టర్!
ఒక్క ఎక్స్ ప్రెషన్ కోసం రెండు గంటల సమయం!
ప్రభాస్ ని అంతలా కష్టపెడుతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli)కి జక్కన్నగా పేరుంది. ప్రతి షాట్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. తాను అనుకున్న విధంగా ఆ షాట్ వచ్చేవరకు చెక్కుతూనే ఉంటారు. ఈ విషయాన్ని రాజమౌళితో పనిచేసిన హీరోలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
ఇక తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కూడా ఇదే స్కూల్ కి చెందిన వారనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్టిస్టుల చిన్న ఎక్స్ ప్రెషన్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరని తెలుస్తోంది. అక్కడున్నది ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్(Prabhas) అయినా కూడా.. సందీప్ తీరు ఇలాగే ఉంటుందని సన్నిహిత వర్గాల మాట.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో 'స్పిరిట్'(Spirit) మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ప్రభాస్ ఎప్పుడో కమిట్ అయ్యారు. కానీ, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండి.. తన సినిమాకి తగినన్ని డేట్స్ కేటాయించలేరనే ఉద్దేశంతో.. సందీప్ కొంతకాలంపాటు వెయిట్ చేశారు. తాను అడిగినన్ని డేట్స్ ఇవ్వడానికి ప్రభాస్ ఓకే చెప్పడంతో.. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టారు.

Also Read: రాజా సాబ్ ఎఫెక్ట్.. మారుతికి మొట్టికాయలు.. పీపుల్ మీడియాకి మరో ఛాన్స్!
'స్పిరిట్' ఎంత భాగం షూటింగ్ పూర్తయిందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రభాస్ అభిమానుల్లో ఉంది. అయితే ఇప్పటివరకు ఒకే ఒక్క సీన్ షూటింగ్ కంప్లీట్ అయిందట. కానీ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వచ్చిందని, ఈ ఒక్క సీన్ వంద కోట్లతో సమానమనే మాట వినిపిస్తోంది.
అయితే ఈ సీన్ షూటింగ్ విషయంలో ప్రభాస్ ని సందీప్ రెడ్డి బాగానే కష్టపెట్టారట. ముఖ్యంగా తనకు కావాల్సినట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ రావడం కోసం.. ఏకంగా రెండు గంటల పాటు ప్రభాస్ ని ఎండలో నిలబెట్టారనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
'ది రాజా సాబ్' విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. బాడీ డబుల్ ఉపయోగించడం, ఫేస్ రీప్లేస్మెంట్ చేయడం వంటివి అభిమానులకు బాగా నిరాశ కలిగించాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్ కి మరిచిపోలేని ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఎంతో కష్టపడుతున్నారట. సందీప్ రెడ్డికి పూర్తిగా సరెండర్ అయిపోయి, 'స్పిరిట్' కోసం ప్రభాస్ చెమటోడ్చుతున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



