సమంత 'యశోద' రిలీజ్ డేట్ వచ్చేసింది
on Oct 17, 2022

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'యశోద'. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 11న చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం విడుదల కానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

నిజానికి సమంత నటించిన మరో చిత్రం 'శాకుంతలం' ఈ నవంబర్ 4న విడుదల కావాల్సి ఉంది. కానీ 3Dలో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఆ చిత్రాన్ని వాయిదా వేశారు. గుణ టీమ్ వర్క్స్ పై రూపొందుతోన్న ఆ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. దీనితో పాటు విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఖుషి'లోనూ సమంత నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



