లక్కీ సీజన్ లో సామ్.. మ్యాజిక్ కొనసాగేనా!
on Feb 4, 2022

సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ఈ తరం కథానాయికల్లో.. చెన్నై పొన్ను సమంత ఒకరు. అదృష్టానికే అసూయ పుట్టే స్థాయిలో తన ఖాతాలో మంచి మంచి విజయాలను జమ చేసుకుంది సామ్.
ఇక సమ్మర్ సీజన్ లో అయితే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో దాదాపుగా విజయం సాధించాయి. `మనం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `తెరి` (తెలుగులో `పోలీస్`), `24`, `బ్రహ్మోత్సవం`, `అ ఆ`, `రంగస్థలం`, `మహానటి`, `ఇరుంబు తిరై` (తెలుగులో `అభిమన్యుడు`), `సూపర్ డీలక్స్`, `మజిలీ`.. ఇలా తెలుగు, తమిళ భాషల్లో సమంత నటించిన పదకొండు చిత్రాలు వేసవిలో విడుదల కాగా, వీటిలో `బ్రహ్మోత్సవం` మినహాయిస్తే మిగిలినవన్నీ సక్సెస్ అయ్యాయి.
Also Read: వరుణ్ తేజ్ తో పెళ్లి వార్తలపై లావణ్య త్రిపాఠి రియాక్షన్!
కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత తన లక్కీ సీజన్ లో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది సామ్. ఆ చిత్రమే.. `కాత్తు వాక్కుల రెండు కాదల్`. విజయ్ సేతుపతి, నయనతార వంటి వెర్సటైల్ స్టార్స్ తో కలిసి సామ్ నటించిన ఈ కోలీవుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అయింది. మరి.. లక్కీ సీజన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో సమంత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: 'ఖిలాడి' అత్తగా అనసూయ?
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత ఖాతాలో `శాకుంతలం`, `యశోద` వంటి పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరమే ఈ రెండు సినిమాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



