మనసు కోరితే తగ్గేదేలే.. సౌత్ సినిమాపై బన్నీ సెటైర్!
on Feb 4, 2022

'పుష్ప ది రైజ్' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప సినిమాలో బన్నీ చెప్పిన 'తగ్గేదేలే' ఊతపదం, బన్నీ వేసిన స్టెప్స్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం బన్నీని ఇమిటేట్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా బన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పలు కంపెనీలు బన్నీతో తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బన్నీ తాజాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇందుకు సంబంధించిన యాడ్ ని తాజాగా విడుదల చేసింది జొమాటో. బన్నీ, ప్రముఖ నటుడు సుబ్బరాజుపై తెరకెక్కించిన ఈ యాడ్ ఆకట్టుకుంటోంది.
ఫైట్ సీన్ లో సుబ్బరాజుని బన్నీ కొట్టగా.. గాల్లోకి ఎగిరిన సుబ్బరాజు 'బన్నీ నన్ను తొందరగా కింద పడేయవా' అని అడగగా.. 'సౌత్ సినిమా కదా.. ఎక్కువ సేపు ఎగరాలి' అంటూ సీరియస్ టోన్ లో సెటైర్ వేస్తాడు బన్నీ. 'గోంగూర మటన్ తినాలని ఉంది.. కిందకి వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు' అని సుబ్బరాజు అనగా.. 'గోంగూర మటన్ ఏంటి.. ఎప్పుడు ఏం తినాలన్నా జొమాటో ఉందిగా' అని చెప్పిన బన్నీ'మనసు కోరితే తగ్గేదేలే.. జొమాటో ఓపెన్ చేయడమే' అంటాడు. సరదా సంభాషణతో తెరకెక్కిన ఈ యాడ్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ యాడ్ సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



