దుల్కర్ సల్మాన్ ఆ సినిమాకి ప్లస్ అవుతాడా?
on Oct 3, 2023
ఈమధ్య టాలీవుడ్‌లో యాక్షన్ సెషన్ నడుస్తోంది. యాక్షన్ బేస్డ్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. దానికి భిన్నంగా ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హ్యాపీడేస్, కేరింత.. చిత్రాల తరహాలో పూర్తి యూత్‌ఫుల్ మూవీగా తెరకెక్కిన ‘మ్యాడ్’ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బేనర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ‘మ్యాడ్’ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి, ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్‌కి కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో హిలేరియస్ కామెడీ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. భారీ యాక్షన్ సినిమాల మధ్యలో యూత్‌కి కొంత రిలీఫ్‌నిచ్చే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 4న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కి యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న దుల్కర్ ఈ ఫంక్షన్‌కి హాజరవడం ‘మ్యాడ్’ చిత్రానికి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీగౌరీప్రియ రెడ్డి వంటి నూతన తారలతోపాటు రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. షమద్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
