అతనితో ఎన్టీఆర్ మరోసారి భేటీ.. కారణమేంటో తెలుసా?
on Oct 3, 2023
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'ను పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న 'వార్-2'తో బిజీ కానున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ మూవీ కోసం ఇప్పటికే అయాన్ ఓసారి ఎన్టీఆర్ తో భేటీ అయ్యాడు. ఆ సమయంలో వీరి మధ్య కథ, అందులో ఎన్టీఆర్ పాత్ర గురించి చర్చలు జరిగాయి. తాజాగా వీరి మధ్య మరోసారి భేటీ జరిగింది.
తాజాగా అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని మీట్ అయ్యాడు. 'వార్-2'కి సంబంధించి వీరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ కి వినిపించిన అయాన్.. అలాగే ఆయన పోషించనున్న పాత్రకు సంబంధించి ఇన్ పుట్స్ ఇచ్చినట్లు సమాచారం. 'వార్-2' ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. నవంబర్ లోపు 'దేవర'ను పూర్తి చేసి, ఆ తర్వాత 'వార్-2'తో బిజీ కానున్నాడు ఎన్టీఆర్.
'దేవర' మూవీ 2024, ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. 'వార్-2' 2025, జనవరిలో థియేటర్స్ లో అడుగు పెట్టనుంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నాడు ఎన్టీఆర్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
