2017 నుంచి నేను ప్రెగ్నెంట్నే!
on Jun 18, 2021
తమిళ ఈలం దళ సభ్యురాలు రాజ్యలక్ష్మి అలియాస్ రాజీగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత అక్కినేని ప్రదర్శించిన సూపర్బ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా ఆమెలో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ను మనం చూడలేదు. తొలి వెబ్ సిరీస్తోటే ఆమె నేషనల్ ఫిగర్ అయిపోయారు. ఆమె కోసం ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత కాలం క్రితం నాటి ఓ వీడియో ఆన్లైన్లో మరోసారి ప్రత్యక్షమైంది. అందులో ఓ అభిమాని సమంతను ఆమె ప్రెగ్నెంట్ అవునా? కాదా అని కుతూహలంతో అడిగాడు.
ఇన్స్టాలైవ్కు చెందిన ఆ వీడియోలో ఆమె ఫాలోయర్ "మీరు ప్రెగ్నంటా?" అని అడిగితే, తనదైన స్టైల్లో సమంత, "2017 నుంచి నేను ప్రెగ్నెంట్నే అనుకుంటున్నా. కానీ ఈ బేబీ నిజంగా బయటకు రావాలని అనుకోవట్లేదనుకుంటాను." అని చెప్పారు. అభిమాని ప్రశ్నకు సరదాగా ఆమె ఇచ్చిన జవాబు ఆ టైమ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో తన టాట్టూ అర్థం ఏమిటి, తన హైట్, శాకాహారిగా ఎందుకు మారిందనే విషయం, టీజేర్లకు స్కిన్‌కేర్ టిప్స్ లాంటి పలు విషయాల గురించి మాట్లాడారు సమంత. 'ఏమాయ చేశావే' మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన సమంత, ఆ సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి, 2017లో పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ డైరెక్షన్లో 'శాకుంతలం', తమిళంలో విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో 'కాదు వాకుల రెండు కాదల్' సినిమాలు చేస్తున్నారు.