తెలుగులో భారీ వెబ్ సిరీస్... 100 ఎపిసోడ్స్!
on Jun 26, 2019

తెలుగులో వెబ్ సిరీస్‌ల టైమ్ మొదలైంది. ఓ రెండేళ్ల ముందువరకు ఔత్సాహిక దర్శకులు వెబ్ సిరీస్‌లు తీసేవారు. తర్వాత తర్వాత పేరున్న నిర్మాతలు, దర్శకులు వెబ్ సిరీస్‌లు తీయడం మొదలు పెట్టారు. అమేజాన్ ప్రైమ్ కోసం ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్ 'గ్యాంగ్ స్టార్స్' అని ఒక వెబ్ సిరీస్ నిర్మించారు. అందులో నవదీప్, జగపతిబాబు తదితరులు నటించారు. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌కి దర్శకురాలు నందినీ రెడ్డి రూపకర్త. అలాగే, ఆమె యప్ టీవీ కోసం 'మన ముగ్గురి లవ్ స్టోరీ' అని మరో వెబ్ సిరీస్ రూపొందించారు. సోనీ లివ్ కోసం దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో 'భజన బ్యాచ్' అని ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ 10, 15, 20 ఎపిసోడ్స్‌లో పూర్తయ్యే వెబ్ సిరీస్ లు. ఇవన్నీ ఒక ఎత్తు... మధుర శ్రీధర్ నిర్మాణంలో రూపొందుతోన్న ఒక వెబ్ సిరీస్ మరో ఎత్తు. 100 ఎపిసోడ్స్‌తో ఆయనో వెబ్ సిరీస్‌కి శ్రీకారం చుట్టారు. బహుశా... తెలుగులో, ఆ ఆమాటకొస్తే ఇండియాలో భారీ వెబ్ సిరీస్ ఇదేనేమో. సీరియల్ టైపులో సాగుతుందన్నమాట. ఆల్రెడీ 70 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేశారు. మరో 30 ఎపిసోడ్స్ షూటింగ్ త్వరలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



