కూలీ ని దెబ్బ కొట్టిన వార్ 2 !
on Oct 11, 2025

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద అగస్ట్ 14 న పోటీపడిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా చిత్రాలు వార్ 2(war 2) ,కూలీ(Coolie).అతి పెద్ద మల్టిస్టారర్ చిత్రాలు కూడా కావడంతో, ఏ చిత్రం విజయాన్ని సాధిస్తుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఏర్పడింది. కాకపోతే రెండు చిత్రాలకి కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్ రాలేదు. వసూళ్ల పరంగా మాత్రం కూలీ 512 కోట్ల రూపాయిల గ్రాస్ తో ముందువరసలో నిలిచింది. 360 కోట్ల గ్రాస్ దగ్గరే వార్ 2 ఆగిపోయింది.
ఈ రెండు చిత్రాలు ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చాయి.కూలీ సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియో(Prime Video)లో అందుబాటులో ఉండగా, వార్ 2 రీసెంట్ గా అక్టోబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్(Net Flix)వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఓటిటి సినీ ప్రియుల ఆదరణ విషయంలో కూలీ కంటే వార్ 2 పై చేయి నిలిచినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆదరణ విషయంలో సదరు ఓటి టి ఛానల్స్ ప్రారంభం నుంచి వాచింగ్ అవర్స్ ని లెక్కిస్తాయి. వీటిల్లో ఎక్కువ వాచింగ్ అవర్స్ ని వార్ 2 దక్కించుకుందని అంటున్నారు. అయితే కూలీకి మొదట్లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కి రాలేదు. వార్ 2 మాత్రం హిందీ కలిపే వచ్చింది.
ఈ వ్యత్యాసం వాచింగ్ అవర్స్ పై ప్రభావం చూపించి ఉండవచ్చనే మాటలు కూడా సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. మరి పూర్తి వివరాలని సదరు సంస్థలు అధికారంగా ప్రకటిస్తే కానీ అసలు విషయం తెలియదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



