ప్రియాంక మోహన్ మరి ఇంత అసభ్యకరమా! ఓజి హిట్ అయితే ఇలాగే ఉంటుంది
on Oct 11, 2025

ప్రియాంక మోహన్(Priyanka MOhan)తన కెరీర్ కి సంబంధించిన అతిపెద్ద బ్రేక్ కోసం సుమారు ఆరు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తు వస్తుంది. ఆ ఎదురుచూపులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(OG)ద్వారా ఫలించాయి. ఓజాస్ గంభీర్ వైఫ్ కణ్మణి క్యారక్టర్ లో ప్రియాంక ప్రదర్శించిన సెటిల్డ్ పెర్ ఫార్మెన్సు ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైగా ఓజి ఘన విజయాన్ని సాధించడమే కాకుండా పవన్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ ని సృష్టించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇప్పుడు ప్రియాంక మోహన్ పేరు తెలుగుతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతుంది. పలు భారీ చిత్రాలలో కూడా ఆఫర్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది.
రీసెంట్ గా నెట్టింట ప్రియాంక కి చెందిన అసభ్యకరమైన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి . సదరు ఫొటోస్ లో ప్రియాంక ఓవర్ ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ షాక్ అవ్వడంతో పాటు ప్రియాంక ఇలా మారిపోయిందేంటనే కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా సదరు పిక్స్ ని షేర్ కూడా చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం అవి ప్రియాంక ఫోటోలు కాదు. 'ఏఐ' తో చేసారని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానుల నమ్మకమే నిజమయ్యింది. ఈ విషయంపై ప్రియాంక 'ఎక్స్' వేదికగా స్పందిస్తు 'ఏఐ'(AI)ద్వారా నన్ను తప్పుగా చూపిస్తు క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం దయచేసి ఆపండి.
ఏఐ టెక్నాలజీని క్రియేవిటీ కోసం వాడుకోవాలి. తప్పుడు సమాచారం సృష్టించడానికి కాదు. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అనే దానిపట్ల జాగ్రత్త వహించాలని కొంచం కటువుగానే స్పందించింది. చెన్నై కి చెందిన ప్రియాంక నాచురల్ స్టార్ నాని(Nani)గ్యాంగ్ లీడర్ తో సినీ రంగ ప్రవేశం చేసి ఓజి వరకు తను చేసిన సినిమాలన్నిటిలో ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



