'గీత'తో వస్తున్న వినాయక్ శిష్యుడు!
on Oct 11, 2022

గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన చిత్రం 'గీత'. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'మ్యూట్ విట్నెస్' అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ వినాయక్ ని కలవగా ఆయన విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ "తన శిష్యుడు విశ్వకు మంచి పేరు, తన మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా 'గీత' నిలవాలి" అని ఆకాంక్షించారు. వి.వి.వినాయక్ తమ చిత్రం 'గీత' ఘన విజయం సాధించాలని ఆకాంక్షించడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వక్తం చేశారు. ఈనెల 14న 'గీత' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

'కుమారి 21F'తో కుర్రకారుకి దగ్గరైన హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. 'నువ్వే కావాలి' ఫేమ్ సాయి కిరణ్ విలన్ గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



